logo

రూ.1,200 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం

కాంచీపురం జిల్లాలో ఇప్పటి వరకు రూ.1,200 కోట్ల విలువైన 129 ఎకరాల ఆలయ ఆస్తులను ఆక్రమణ దారుల నుంచి స్వాధీనం చేసుకున్నామని దేవాదాయశాఖ మంత్రి పీ.కే. శేఖర్‌బాబు తెలిపారు. కాంచీపురం కామరాజర్‌ వీధిలోని ఆలయ ఆస్తులను ఆక్రమించి టైర్ల కంపెనీ నిర్వహిస్తున్నట్లు

Published : 12 Apr 2022 03:00 IST

మంత్రి పీ.కే.శేఖర్‌బాబు
​​​​​​​

కాంచీపురంలో ఆలయాన్ని పరిశీలిస్తున్న మంత్రి

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం జిల్లాలో ఇప్పటి వరకు రూ.1,200 కోట్ల విలువైన 129 ఎకరాల ఆలయ ఆస్తులను ఆక్రమణ దారుల నుంచి స్వాధీనం చేసుకున్నామని దేవాదాయశాఖ మంత్రి పీ.కే. శేఖర్‌బాబు తెలిపారు. కాంచీపురం కామరాజర్‌ వీధిలోని ఆలయ ఆస్తులను ఆక్రమించి టైర్ల కంపెనీ నిర్వహిస్తున్నట్లు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. ఈనేపథ్యంలో శేఖర్‌బాబు ఆదివారం రాత్రి కాంచీపురానికి చేరుకుని ఆక్రమణలో ఉన్న ఆలయ ఆస్తులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంచీపురం కామరాజర్‌ వీధిలో సుమారు 100 ఏళ్ల క్రితం జీవసమాధి అయిన లింగాయతుల సమాజానికి చెందిన ఆలయం ఉందని, రెవెన్యూ శాఖ రికార్డుల్లో కల్‌మటం (రాతిమటం) అని ఉన్నట్లు దీనికి సంబంధించి కోర్టుల్లో కేసులు నడిచాయని తెలిపారు. ఈ ఆలయం వ్యక్తిగతంగా ఒకరికి సొంతమైనదా? లేక లింగాయతుల సమాజానికి చెందినదా అని వారిచ్చే ఆధారాల్ని బట్టి నిర్ణయిస్తామని తెలిపారు. కోర్టు తీర్పులు ఉన్నందున దేవాదాయ శాఖ న్యాయ విభాగంచే పర్యవేక్షిస్తామని తెలిపారు. మదురై వీరవసంత నాయకర్‌ మంటపానికి రూ.19 కోట్ల వ్యయంతో మరమ్మతులు జరగుతున్నాయని తెలిపారు. మంత్రి వెంట కాంచీపురం ఎంపీ జీ.సెల్వం, ఎమ్మెల్యేలు కే. సుందర్‌, సీవీఎంపీ ఎళిలరసన్‌, దేవాదాయ శాఖ జాయింటు కమిషనరు పొన్‌ జయరామన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని