icon icon icon
icon icon icon

Assembly Election Results: ఆధిక్యంలో మ్యాజిక్‌ ఫిగర్ దాటిన భాజపా.. ప్రభుత్వం తమదేనన్న చౌహాన్‌

Assembly Election Results: ఎన్నికల ఫలితాలు వెలువడుతోన్న సమయంలో ఆయా రాష్ట్రాల కీలక నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

Updated : 03 Dec 2023 11:18 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావించే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో విజయావకాశాలు, ముఖ్యమంత్రి అభ్యర్థులపై  ఆయా రాష్ట్రాల నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. (Assembly Election Results)

మధ్యప్రదేశ్‌లో ఆధిక్యంలో భాజపా మ్యాజిక్ ఫిగర్‌ దాటింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ ట్వీట్ చేశారు. ‘పూర్తిస్థాయి మెజార్టీతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అని ధీమా వ్యక్తంచేశారు. మరోవైపు  మధ్యప్రదేశ్‌(madhya pradesh)లో కాంగ్రెస్ విజయంపై మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కూడా విశ్వాసం వ్యక్తం చేశారు. ‘నేను ఏ ట్రెండ్ చూడలేదు. ఉదయం 11 వరకు నాకు ఏ ట్రెండ్ అవసరం లేదు. నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. నాకు మధ్యప్రదేశ్‌ ఓటర్లపై నమ్మకం ఉంది. ప్రజల తీర్పు వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌

రాజస్థాన్‌(rajasthan) ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తమ పార్టీ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని అన్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, భాజపా మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది. భాజపా కూడా విజయంపై నమ్మకంతో ఉంది. ఆ పార్టీ నేత రాజ్యవర్థన్ సింగ్ రాఠోడ్‌ మీడియాతో మాట్లాడారు. భారీ మెజార్టీతో పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి స్పందించారు. ‘ఇదంతా సమష్టి కృషి. అన్ని నిర్ణయాలు సరైన సమయంలో వెలువడతాయి. ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం అభ్యర్థిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది’ అని అన్నారు. ఇక, ఛత్తీస్‌గఢ్‌లో హస్తం పార్టీ కాస్త ముందంజలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img