icon icon icon
icon icon icon

Chandrababu: మళ్లీ వైకాపా వస్తే మీ భూములు వదులు కోవాల్సిందే: చంద్రబాబు

నవరత్నాల పేరుతో జగన్‌ ప్రజలను మోసం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 02 May 2024 22:40 IST

కడప: నవరత్నాల పేరుతో జగన్‌ ప్రజలను మోసం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కడపలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. వైకాపా నేతలు ప్రజల ఆస్తులు, భూములపై కన్నేశారన్న చంద్రబాబు.. ఇడుపులపాయలో 360 ఎకరాలు కొట్టేసింది ఎవరని ప్రశ్నించారు. తండ్రి ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వకపోవడంతో... జగనన్న బాణం ఇప్పుడు రివర్స్‌ అయిందని ఎద్దేవా చేశారు. అన్నా..చెల్లి ఇంట్లో పోరాడుకోవాలికానీ, ఓట్లు చీల్చడం సరికాదని హితవు పలికారు. దుర్మార్గుడికి ఓటు వేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లేనని వ్యాఖ్యానించారు. స్థానిక ఎమ్మెల్యే, మేయర్‌ సురేష్‌, రవీంద్రనాథ్‌రెడ్డి.. ఈ ముగ్గురు మారీచులు కలిసి కడపను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

జగన్‌ నవరత్నాల్లో ఇసుక, గంజాయి, భూ మాఫియా, మైనింగ్‌, హత్యా రాజకీయాలు, ప్రజల ఆస్తులు కబ్జా, సెటిల్‌మెంట్లు, దాడులు-కేసులు, శవరాజకీయాలు ఉన్నాయన్నారు. వైకాపా మళ్లీ గెలిస్తే  ప్రజల భూములపై ఆశలు వదులుకోవాల్సిందేనన్నారు. రెండు సార్లు శంకుస్థాపన చేసిన రాయలసీమ స్టీల్ ప్లాంట్‌ను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు అంగుళమైనా కదిలిందా? ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా? అని నిలదీశారు. వైఎస్‌ఆర్‌ చనిపోతే మిత్రుడిని కోల్పోయామని బాధపడ్డాం.. కానీ, తండ్రి అంత్యక్రియలకు ముందే సీఎం కావాలని జగన్‌ సంతకాల సేకరణ చేపట్టారని విమర్శించారు. నేరాలు చేయడంలో పీహెచ్‌డీ చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేదే కూటమి ఆలోచన అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img