icon icon icon
icon icon icon

Chandrababu: హంతకుల గుండెల్లో నిద్రపోతా: చంద్రబాబు

వైకాపా హయాంలో కూల్చివేతలు, దాడులు తప్ప ఇంకేం లేదని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? అని ప్రశ్నించారు.

Published : 29 Apr 2024 21:46 IST

నందికొట్కూరు: వైకాపా హయాంలో కూల్చివేతలు, దాడులు తప్ప ఇంకేం లేదని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? అని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఎన్నికల్లో జగన్‌కు శిక్షవేసే బాధ్యత ప్రజలదేనన్నారు. 

‘‘ ప్రజల జీవితాలను సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్‌. డ్రైవింగ్‌ తెలియని వ్యక్తి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టారు. ఆయన రివర్స్‌లో డ్రైవింగ్‌ చేస్తున్నారు. జగన్‌కు సంపద సృష్టించడం తెలియదు. బటన్‌ నొక్కింది ఎంత? బొక్కింది ఎంత? రాజకీయం అంటే సేవాభావం. ప్రజలకు అండగా ఉండటం. అంతేగాని, వారిని అణగదొక్కడం కాదు. పేదరికం లేని సమాజాన్ని చూడటమే నా ఆశయం. ఈ ముఖ్యమంత్రి డ్రామాల రాయుడు. సానుభూతితో ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు. ఆయన్ని శాశ్వతంగా ఇంటికి పంపించే బాధ్యత  మీ అందరిదే. రాజకీయాలంటే హత్యలు కాదు. హంతకుల గుండెల్లో నిద్రపోతా. అలాంటి ఆలోచన రావడానికే భయపడేలా చేస్తా.

మేం అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తలు, హోంగార్డులకు జీతాలు పెంచుతాం. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీలు ఇస్తాం.  జే బ్రాండ్‌, గంజాయి వల్ల రాష్ట్రం సర్వనాశనమైంది. జగన్‌ చేసిన ఘోరాలు చెప్పుకొంటూ పోతే ఐదేళ్లైనా సరిపోదు. సమర్థవంతమైన నాయకుడంటే పరిశ్రమలు తీసుకురావాలి. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే. కాంగ్రెస్‌, భాజపాతో ఉండనని చెబుతున్న జగన్‌.. కేంద్రంలో ఎవరికి మద్దతిస్తారో చెప్పాలి? నేరాలు.. ఘోరాలు చేయడంలో జగన్‌ పీహెచ్‌డీ చేశారు కానీ, ఆర్థిక వ్యవస్థ ఏమీ తెలియని వ్యక్తి. దోచుకోవడం.. దాచుకోవడంలో మాత్రం మంచి ఎక్స్‌పర్ట్‌’’ అని చంద్రబాబు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img