icon icon icon
icon icon icon

వైకాపాలో చేరనందుకు పాత కేసు పైకి!

ఆరేళ్ల నాటి క్రికెట్‌ బెట్టింగు కేసు విచారణ నిమిత్తం సీఐడీ అధికారులు తెదేపా సానుభూతిపరుడైన నెల్లూరుకు చెందిన లీలామోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.

Updated : 25 Apr 2024 08:25 IST

నెల్లూరు, న్యూస్‌టుడే: ఆరేళ్ల నాటి క్రికెట్‌ బెట్టింగు కేసు విచారణ నిమిత్తం సీఐడీ అధికారులు తెదేపా సానుభూతిపరుడైన నెల్లూరుకు చెందిన లీలామోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.

బుధవారం నగరంలోని ఓ హోటల్‌లో లీలామోహన్‌రెడ్డి ఉండగా, సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని కార్యాలయానికి తరలించారు. దీంతో తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు సీఐడీ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెదేపా నాయకుడు మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైకాపా నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు వైకాపా కండువా కప్పుకోవాలని లేదంటే అరెస్టు చేయిస్తామని లీలామోహన్‌రెడ్డిని బెదిరిస్తున్నారన్నారు. వైకాపాలో చేరేందుకు నిరాకరించడంతోనే సీఐడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img