icon icon icon
icon icon icon

అక్కడి వాతావరణం చూశాక.. వెంటనే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు

వైకాపా ఎమ్మెల్యేలు సైతం సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసే పరిస్థితి ఉండదని మాజీ క్రికెటర్‌, జనసేన పార్టీ నాయకుడు అంబటి రాయుడు అన్నారు. రాచరికం, ఆధిపత్య ధోరణి తరహాలోనే ఆ పార్టీ పాలన సాగిందని విమర్శించారు.

Published : 28 Apr 2024 07:03 IST

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: వైకాపా ఎమ్మెల్యేలు సైతం సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసే పరిస్థితి ఉండదని మాజీ క్రికెటర్‌, జనసేన పార్టీ నాయకుడు అంబటి రాయుడు అన్నారు. రాచరికం, ఆధిపత్య ధోరణి తరహాలోనే ఆ పార్టీ పాలన సాగిందని విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో ఆయన శనివారం పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘గతంలో నేను వైకాపా వారి వద్దకు వెళ్లినప్పటికీ అక్కడి వాతావరణం చూశాక ప్రజాసేవకు ఇది వేదిక కాదనిపించింది. వెంటనే బయటకు వచ్చేశా. పవన్‌కల్యాణ్‌ నాయకత్వం, ఆయన ఆశయాలు నచ్చి జనసేనలోకి వచ్చా. రాష్ట్ర ప్రగతికి, యువతకు ఉపాధి కోసం కూటమి అభ్యర్థులను మనమంతా గెలిపించుకోవాల్సిన అవసరముంది’ అని పేర్కొన్నారు. ప్రతి ఓటు సద్వినియోగం కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆయన గ్రామంలోని ఆలయాల్లో పూజలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img

నియోజకవర్గ సమాచారం