icon icon icon
icon icon icon

నీటి సమస్య మాటేంటి?.. వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డిని నిలదీసిన గ్రామస్థులు

కర్నూలు జిల్లా కౌతాళం మండలం అగసలదిన్నెలో బుధవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.

Updated : 02 May 2024 07:49 IST

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా కౌతాళం మండలం అగసలదిన్నెలో బుధవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గ్రామస్థులు, మహిళలు ఆయన్ను తాగునీటి సమస్యపై నిలదీశారు. మూడుసార్లు గెలిపించినా నీటి సమస్య తీర్చలేదని మండిపడ్డారు. ఓట్ల కోసం మాత్రమే వస్తారు, గెలిచిన తర్వాత పట్టించుకోరని ప్రశ్నించారు. బాలనాగిరెడ్డి మాట్లాడుతూ.. ఈసారి గెలిపించండి, ఎన్నికల తర్వాత తాగునీటి సమస్య పరిష్కరిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img