icon icon icon
icon icon icon

పింఛన్ల పంపిణీలో మాజీ వాలంటీర్లు.. వైకాపాకు అనుకూలంగా ఓట్ల అభ్యర్థన!

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని వరదాయపల్లిలో బుధవారం మాజీ వాలంటీర్లు పింఛన్ల సొమ్మును పంపిణీ చేయడం వివాదాస్పదమైంది.

Updated : 02 May 2024 08:03 IST

పెద్దపప్పూరు, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని వరదాయపల్లిలో బుధవారం మాజీ వాలంటీర్లు పింఛన్ల సొమ్మును పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. పంచాయతీ కార్యదర్శి సుబ్బరాయుడు సెలవులో ఉండడంతో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ హేమ అన్నీ తానై వ్యవహరించారు. ముచ్చుకోట సచివాలయ పరిధిలో దాదాపు 750 మంది పింఛనుదారులు ఉండగా 200 మందికి ఇంటి వద్దే పంపిణీ చేసేలా ప్రభుత్వం ఆదేశించింది. పింఛన్ల సొమ్మును వెల్ఫేర్‌ అసిస్టెంట్‌...రాజీనామా చేసిన   గ్రామ వాలంటీర్లకు అందించి పంపిణీ చేయాలని సూచించారు.  వరదాయపల్లిలో మాజీ వాలంటీరు షేక్షావలి పింఛను సొమ్మును లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా 19 మంది మాజీ వాలంటీర్లు సైతం నగదును పింఛనుదారులకు అందజేశారు. దీనిపై గ్రామస్థులు వారిని నిలదీశారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. మాజీ వాలంటీర్లు పింఛను సొమ్మును పంపిణీ చేయడంతో పాటు వైకాపాకు ఓటు వేయాలని అభ్యర్థించినట్లు సమాచారం. వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ హేమ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారని, ముందు నుంచే ఈమె పనితీరు వివాదాస్పందంగా ఉంటోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై   ఎంపీడీవో కవితను వివరణ కోరగా క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img