icon icon icon
icon icon icon

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ముగ్గురు ప్రచార సారథులు

రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది.

Published : 12 Nov 2023 11:17 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం, సుభాష్‌నగర్‌: రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. దానికి కారణం ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి శాసనసభ ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీల్లో ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికలో, పార్టీ నిర్ణయాల్లో వీరి పాత్ర ఉంది. ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీల తరఫున వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు.

అన్నీ తానై ప్రచారంలో కేటీఆర్‌

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల అభ్యర్థి, మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరఫున అన్ని తానై వ్యవహరిస్తున్నారు. జిల్లాల్లో  సభలు నిర్వహించి తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు పరిచిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభల పేరిట అనేక నియోజకవర్గాల్లో పాల్గొని ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల నామపత్రాల దాఖలు కార్యక్రమాల్లో ఏర్పాటు చేస్తున్న రోడ్‌షోల్లో కూడా పాల్గొన్నారు.


  భాజపా నుంచి ఈటల, బండి

భాజపాకు సంబంధించి రాష్ట్రంలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వీరిద్దరు ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో, పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ బరిలో నిలవడంతోపాటు గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారు. పార్టీ క్యాంపెయినర్‌గా పలు జిల్లాల నియోజకవర్గాల్లో పార్టీ పక్షాన ప్రచార సభల్లో పాల్గొంటున్నార[ు. ఎంపీ బండి సంజయ్‌ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా పని చేసినప్పుడు ఆ పార్టీకే ఊపు తీసుకొచ్చారనే పేరుంది. ప్రస్తుతం పార్టీ క్యాంపెయినర్‌గా, కరీంనగర్‌ అభ్యర్థిగా నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇతర జిల్లాల్లో పార్టీ ప్రచార సభల్లో పాల్గొని అభ్యర్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరిద్దరికి పార్టీ అధిష్ఠానం హెలికాప్టర్‌ కేటాయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img

    నియోజకవర్గ సమాచారం