icon icon icon
icon icon icon

Kanakamedala Ravindra: పోలింగ్‌ సమయం పెంచండి.. ఈసీకి తెదేపా విజ్ఞప్తి

ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్‌ సమయంలో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా కోరింది.

Published : 02 May 2024 15:39 IST

అమరావతి: ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్‌ సమయంలో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా కోరింది. మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో.. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదని, స్వల్ప మార్పులు చేయాలని ఆ పార్టీ సీనియర్‌ నేత కనకమేడల రవీంద్రకుమార్‌ ఈసీకి లేఖ రాశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5వరకు ఉన్న పోలింగ్‌ సమయాన్ని మరో గంటపాటు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఓటింగ్‌ శాతం పెరుగుతుందని ఈసీ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే తెలంగాణలో పోలింగ్‌ సమయాన్ని పొడిగించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. 

మోసగాళ్ల నీతులు..

అంతకుముందు కనకమేడల మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌పై మొత్తం 29 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారని తెలిపారు. ఆయా కేసుల విషయంలో న్యాయస్థానాల ప్రొసీడింగ్స్‌కు జగన్‌ అడ్డుపడుతున్నారని సీబీఐ చెప్పిందని కనకమేడల అన్నారు. న్యాయపక్రియను అడ్డుకుంటున్న మోసగాళ్లు ఎన్నికల్లో మాత్రం నీతులు చెబుతున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img