icon icon icon
icon icon icon

Nara Lokesh: గులకరాయి ఘటనలో జగన్‌కు భాస్కర్‌ అవార్డు ఇవ్వాలి: నారా లోకేశ్‌ ఎద్దేవా

గులకరాయి ఘటనలో సీఎం జగన్‌కు ఆస్కార్‌కు బదులు భాస్కర్‌ అవార్డు ఇవ్వాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

Published : 28 Apr 2024 12:02 IST

అమరావతి: గులకరాయి ఘటనలో సీఎం జగన్‌కు ఆస్కార్‌కు బదులు భాస్కర్‌ అవార్డు ఇవ్వాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం నీరుకొండలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తమకు సక్రమంగా కౌలు డబ్బులు ఇవ్వడం లేదని రైతులు లోకేశ్‌ దృష్టికి తీసుకువచ్చారు. రాజధానిలో పేదలకు ఇచ్చే పింఛన్‌ డబ్బులు కూడా సకాలంలో రావడం లేదని వాపోయారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధానిలో పేదలకు ఇచ్చే రూ.5 వేల పింఛన్‌ను కొనసాగిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. అసైన్డ్‌ రైతులకు ఇవ్వాల్సిన కౌలును వడ్డీతో చెల్లిస్తామన్నారు. రాజధానిలో నిలిచిపోయిన పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img

నియోజకవర్గ సమాచారం