icon icon icon
icon icon icon

Pawan Kalyan: వైకాపా రంగుల పిచ్చితో రూ.2300 కోట్లు దుబారా: పవన్‌ కల్యాణ్‌

రంగుల పిచ్చిలో వైకాపా ప్రభుత్వం రూ.2,300 కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.

Published : 02 May 2024 17:43 IST

పాలకొండ: ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయడానికి రూ.1300 కోట్లు, తీసేయడానికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు. రంగుల పిచ్చిలో వైకాపా ప్రభుత్వం రూ.2,300 కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. అందులో రూ.220 కోట్లు వెచ్చిస్తే తోటపల్లి రిజర్వాయర్‌ ఎడమ కాలువ పూర్తయ్యేదన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో పవన్‌ ప్రసంగించారు.

‘‘సిక్కోలు యువత భగభగ మండే నిప్పుకణికలు.. తెగించి పోరాడాలి. 1960లో బామిని మండలంలో జగన్‌ లాంటి దోపిడీదారుల దాష్టీకాలు తట్టుకోలేక ఉత్తరాంధ్ర ప్రజానీకం తిరగబడింది. ఆరోజులు మళ్లీ వస్తాయని జగన్‌కు చెప్పండి. గ్రామం.. సంగ్రామంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. తప్పు జరిగినప్పుడు ఎదురించకపోతే మన భవిష్యత్తు దెబ్బతింటుంది. జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు.. అన్యాయం జరిగినప్పుడు తిరబడాలి.

కూటమి ప్రభుత్వం వచ్చాక సీతంపేటలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి చేస్తాం. వృద్ధాప్య పింఛను రూ.4వేలు ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ప్రతి రైతుకు ఏటా రూ.20వేల పెట్టుబడి సాయం అందిస్తాం. సీపీఎస్‌ సమస్యకు ఏడాదిలోపు పరిష్కారం చూపుతాం. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకుంటాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తాం. వారి సంక్షేమ నిధికి రూ.కోటి విరాళం ఇస్తా. పంచాయతీలకు కేంద్ర నిధులు అందించే బాధ్యత తీసుకుంటాం. ప్రతి కుటుంబానికి రూ.25లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం. పాలకొండలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టే బాధ్యత తీసుకుంటాం’’ అని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img