icon icon icon
icon icon icon

Priyanka Gandhi: సాగునీటి ప్రాజెక్టుల్లో భారాస భారీగా అవినీతికి పాల్పడింది: ప్రియాంక గాంధీ

రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు.

Updated : 28 Nov 2023 15:08 IST

జహీరాబాద్‌: రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అన్నారు. ఎన్నికల ప్రచారంలో (Telangana Election 2023) భాగంగా జహీరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు.

‘‘ఉద్యోగాల కోసం తెలంగాణ (Telangana) తెచ్చుకుంటే అదీ నెరవేరలేదు. ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్‌ చేసి అవినీతికి పాల్పడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల్లో భారాస (BRS) ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడింది. రూ. 400 గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ. వెయ్యికి పైగా పెంచారు. తెలంగాణలో రైతులు కూడా తీవ్రమైన బాధలో ఉన్నారు. భారాస, భాజపా, ఎంఐఎం సహకరించుకుంటున్నాయి’’ అని ప్రియాంక గాంధీ విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img