
DRDO 2-DG: త్వరలో అందుబాటులోకి 2డీజీ
డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్‌రెడ్డి
హైదరాబాద్: కరోనాపై పోరుకు కొత్త ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్ (2డీజీ) అభివృద్ధి చేసినట్లు డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్‌రెడ్డి తెలిపారు. 2డీజీ ఔషధం కొవిడ్‌పై సమర్థంగా పని చేస్తోందన్నారు. ఈ ఔషధానికి డీఆర్డీవో పేటెంట్ కూడా పొందినట్లు ఆయన వివరించారు. ఈ మందు అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఈటీవీ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. త్వరలో ప్రజలకు అందుబాటులోకి 2డీజీ ఔషధం వస్తుందని సతీశ్‌రెడ్డి తెలిపారు. తీవ్ర కొవిడ్ లక్షణాలున్న వారికి డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఔషధం పని చేస్తుందని తెలిపారు. కృత్రిమ ఆక్సిజన్ అవసరాన్ని 2డీజీ ఔషధం తగ్గిస్తుందన్నారు. రెడ్డీస్ ల్యాబ్‌తో కలిసి దీన్ని రూపొందించామని తెలిపారు.
‘‘దేశం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డీఆర్డీవో తనవంతు పాత్ర పోషిస్తుంది. దిల్లీలో 10 రోజుల్లో వెయ్యి పడకలు అందుబాటులోకి తీసుకొచ్చాం. 2డీజీ ఔషధంతో ప్రాణాపాయ స్థితి తప్పుతుంది. రెడ్డీస్ ల్యాబ్‌తో కలిసి దీన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని సతీశ్‌రెడ్డి అన్నారు. ఈటీవీతో ఆయన ముఖాముఖి కింది వీడియోలో..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.