
Updated : 25 Jan 2022 17:21 IST
CM Jagan: ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం.. ఇవ్వనివీ అమలు చేస్తున్నాం: జగన్
‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకం ప్రారంభించిన సీఎం
అమరావతి: అగ్రవర్ణ పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి లక్ష్యంగా ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకాన్ని తీసుకొచ్చినట్లు సీఎం జగన్ అన్నారు. ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తున్నామని.. ఇవ్వని హామీలూ అమలు చేసి చూపిస్తున్నామని ఆయన చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకాన్ని జగన్ వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3.93 లక్షల మంది 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరి ఖాతాల్లో రూ.589 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి సీఎం జమ చేశారు.
Tags :