Kishan Redddy: వేయిస్తంభాల గుడి నిర్మాణానికి 72 ఏళ్లు పట్టింది: కిషన్‌రెడ్డి

వేయిస్తంభాల గుడిని కట్టేందుకు 72 సంవత్సరాలు పట్టిందని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 08 Mar 2024 10:13 IST

హనుమకొండ: వేయిస్తంభాల గుడిని కట్టేందుకు 72 సంవత్సరాలు పట్టిందని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో పునర్నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. యాగశాలలో శాంతి హోమం చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మధ్యయుగంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను ధ్వంసం చేశారన్నారు. తుగ్లక్‌ సైన్యం రామప్ప గుడి నుంచి వరంగల్‌ కోట వరకు అన్నింటినీ దెబ్బతీసిందని చెప్పారు. తాజాగా పునర్నిర్మాణం చేసిన వేయి స్తంభాల గుడి కల్యాణ మండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేసినట్లు కిషన్‌రెడ్డి వివరించారు. కాకతీయుల శిల్ప కళా వైభవం అద్భుతమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని