KTR: గతేడాది ఒక్క హైదరాబాద్‌లోనే లక్షన్నర ఐటీ ఉద్యోగాలు: కేటీఆర్‌

కరోనా పరిస్థితులు ఉన్నా గతేడాది ఐటీ రంగంలో అంచనాలకు మించి రాణించామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

Updated : 01 Jun 2022 15:31 IST

హైదరాబాద్‌: కరోనా పరిస్థితులు ఉన్నా గతేడాది ఐటీ రంగంలో అంచనాలకు మించి రాణించామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌లో గత 8 ఏళ్లలో ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు. హైటెక్‌సిటీలోని టెక్‌ మహీంద్రా కార్యాలయంలో 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదిక విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య పెరిగిందని కేటీఆర్‌ అన్నారు. గత ఏడాదిలో దేశవ్యాప్తంగా 4.5లక్షల ఉద్యోగాలు లభిస్తే.. ఒక్క హైదరాబాద్‌లోనే లక్షన్నర వచ్చాయని ఆయన వివరించారు. నగరం నుంచి ఐటీ ఎగుమతులు కూడా పెరిగాయన్నారు. 2021-22 ఏడాదిలో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతుల విలువ రూ.1.83లక్షల కోట్లని.. 2035 నాటికి ఈ సంఖ్యను రూ.2.9లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఐటీ, అనుబంధ పరిశ్రమల ఎగుమతుల్లో గతేడాది 26.14 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. జాతీయ సగటు కంటే 9 శాతం అదనంగా వృద్ధి సాధించినట్లు కేటీఆర్‌ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని