KTR: ‘ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో’: కేటీఆర్‌

‘కరెంట్‌ ఇస్తారా.. సబ్‌స్టేషన్‌లో మొసలిని వదలాలా?’ అంటూ కర్ణాటకలోని కొందరు రైతులు వినూత్న నిరసన తెలిపారు.

Published : 24 Oct 2023 15:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సకాలంలో విద్యుత్‌ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ కర్ణాటకలోని కొల్హార తాలూకా రోణిహాల్‌ గ్రామానికి చెందిన రైతులు, స్థానికులు వినూత్న నిరసన తెలిపారు. స్థానికంగా ఉన్న విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు ట్రాక్టర్‌లో ఓ మొసలిని తీసుకొచ్చారు. ‘కరెంట్ ఇస్తారా.. సబ్‌స్టేషన్‌లో మొసలిని వదలాలా?’ అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాజాగా ఈ వీడియోను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు. ‘ ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో’ అంటూ రాసుకొచ్చారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత త్రీఫేజ్‌ విద్యుత్‌ ఇవ్వడం వల్ల పొలాలకు వెళ్లడం ఇబ్బందిగా మారిందని కర్ణాటకలోని రైతులు ఆరోపిస్తున్నారు. పొలానికి వెళ్తున్నప్పుడు స్థానిక కాలువల నుంచి మొసలి పిల్లలు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వన్యప్రాణులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పొలానికి వెళ్లిన సమయంలో దొరికిన మొసలిని ట్రాక్టర్‌లో సబ్‌స్టేషన్‌కు తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం వద్దకు వచ్చిన అటవీశాఖ సిబ్బంది ఆ మొసలిని బంధించి సంరక్షణకేంద్రానికి తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని