Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 28 Feb 2024 17:12 IST

1. ఓఆర్‌ఆర్‌ టు ఆర్‌ఆర్‌ఆర్‌కు రేడియల్‌ రోడ్లు: సీఎం రేవంత్‌

అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ORR) నుంచి ప్రాంతీయ రింగ్‌ రోడ్డు (RRR)కు రేడియల్‌ రోడ్లకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో హెచ్‌ఎండీఏ, పురపాలక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మాస్టర్‌ ప్లాన్‌ - 2050కి అనుగుణంగా విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాలని సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బండి సంజయ్‌ కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి

భాజపా ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి జరిగింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో బుధవారం చోటుచేసుకుంది. ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్‌ అక్కడ పర్యటిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మణిపుర్‌లో అదనపు ఎస్పీ కిడ్నాప్‌..

మణిపుర్‌ (Manipur) పోలీసు కమాండోలు వినూత్న నిరసనకు దిగారు. బుధవారం ఉదయం కొద్దిసేపు ఆయుధాలను విడిచిపెట్టి విధులకు హాజరయ్యారు. మంగళవారం పశ్చిమ ఇంఫాల్‌లోని అదనపు ఎస్పీ అమిత్‌సింగ్‌ ఇంటిపై సుమారు 200 మంది సాయుధులు దాడి చేసి ఆయనతోపాటు మరొకరిని అపహరించుకుపోయారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ₹6 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో సూచీలకు భారీ నష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలను వెనక్కి లాగాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌.. లాక్‌స్క్రీన్‌లో డైరెక్షన్స్‌

గూగుల్‌ మ్యాప్స్‌.. తాజాగా లాక్‌ స్క్రీన్‌పైనే లొకేషన్‌ కనిపించే సదుపాయాన్ని యూజర్లకు పరిచయం చేసింది. సాధారణంగా గూగుల్‌ మ్యాప్స్‌లో మనం వెళ్లాల్సిన ప్రదేశానికి సంబంధించిన వివరాలను అందిస్తే సమయం, షార్ట్‌కట్‌లు కనిపిస్తాయి. కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్‌తో మొబైల్‌ లాక్‌ స్క్రీన్‌పై ఈటీఏ (estimated time of arrival), వెళ్లాల్సిన ప్రదేశానికి డైరెక్షన్స్‌ ప్రత్యక్షమవుతాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మ్యాచ్‌ మధ్యలో మహిళా క్రికెటర్‌కు మ్యారేజ్‌ ప్రపోజల్‌.. ఫొటో వైరల్‌

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024) ఆసక్తికరంగా సాగుతోంది. గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (GG vs RCB) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ జరుగుతుండగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకొంది. బెంగళూరు క్రికెటర్‌ శ్రేయాంక పాటిల్‌ (Shreyanka Patil)కి ఓ అభిమాని మ్యారేజ్‌ ప్రపోజల్‌ పెట్టాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పెళ్లి రూమర్స్‌పై స్పందించిన తాప్సీ.. ఏమన్నారంటే

హీరోయిన్‌ తాప్సీ (Taapsee Pannu) పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతోన్న సంగతి తెలిసిందే. ఆమె మార్చి చివరి వారంలో రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోనున్నట్లు వాటి సారాంశం. తాజాగా వీటిపై ఆమె స్పందించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ ఉద్యోగ ప్రకటనపై జాగ్రత్తగా ఉండండి: ద.మ.రైల్వే హెచ్చరిక

రైల్వే శాఖలో 4,660 ఉద్యోగాలంటూ చక్కర్లు కొడుతున్న నకిలీ ప్రకటనపై దక్షిణ మధ్యరైల్వే స్పందించింది. ఈ నకిలీ ఉద్యోగ నియామక నోటీసుపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ (RPF), రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదని స్పష్టంచేస్తూ ట్వీట్‌ చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సంక్షోభం వేళ ‘రాజీనామా’ వార్తలు.. స్పందించిన హిమాచల్‌ సీఎం

రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన క్రాస్‌ ఓటింగ్‌తో హిమాచల్‌ ప్రదేశ్ (Himachal Pradesh) రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యేల తిరుగుబాటు, మంత్రి రాజీనామాతో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు (Sukhvinder Singh Sukhu) సర్కారు సంక్షోభంలో పడింది. దీంతో పదవి నుంచి దిగిపోయేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

మహిళలను దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలనే అంశంపై భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగాల్సి ఉంది. అయితే, కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను త్వరగా జరపాలని కవిత తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని