CM Revanth: ఓఆర్‌ఆర్‌ టు ఆర్‌ఆర్‌ఆర్‌కు రేడియల్‌ రోడ్లు: సీఎం రేవంత్‌రెడ్డి

అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ORR) నుంచి ప్రాంతీయ రింగ్‌ రోడ్డు (RRR)కు రేడియల్‌ రోడ్లకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Updated : 28 Feb 2024 21:14 IST

హైదరాబాద్: అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ORR) నుంచి ప్రాంతీయ రింగ్‌ రోడ్డు (RRR)కు రేడియల్‌ రోడ్లకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో హెచ్‌ఎండీఏ, పురపాలక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మాస్టర్‌ ప్లాన్‌ - 2050కి అనుగుణంగా విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాలని సూచించారు. ఓఆర్‌ఆర్‌ లోపల ప్రాంతాలను ఒకే యూనిట్‌గా అభివృద్ధి చేయాలన్నారు. ఓఆర్‌ఆర్‌ - ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ప్రాంతాలను హెచ్‌ఎండీఏ పరిధిలోకి తేవాలని చెప్పారు.

మరోవైపు అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ORR) టోల్‌ టెండర్లలో అవకతవకలపై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. టెండర్ల పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌కు స్పష్టం చేశారు. విచారణను సీబీఐ లేదా మరో సంస్థకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని