Top 10 News @ 1PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లో ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 29 Feb 2024 13:15 IST

1. తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ (Mega DSC) నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తన నివాసంలో విడుదల చేశారు. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మేడారం జాతర.. హుండీల లెక్కింపు ప్రారంభం

మేడారంలో సమ్మక్క, సారలమ్మ మహా జాతర వైభవంగా ముగిసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని పెద్ద ఎత్తున కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో జాతర హుండీల లెక్కింపు గురువారం ప్రారంభమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేసీఆర్ అద్వానంగా మార్చారు: చిన్నారెడ్డి

తమ సమస్యలను ప్రజావాణిలో చెప్పేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు అవకాశం కల్పించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. ప్రజావాణిలో ఇప్పటి వరకు 4.90లక్షల అర్జీలు వచ్చాయని చెప్పారు. వీటిలో నాలుగు లక్షలు సమస్యలను పరిష్కరించే దిశగా ఉన్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. మీ చేతులు రక్తంతో తడిసిపోయాయి: పాక్‌కు గట్టిగా బుద్ధిచెప్పిన భారత్‌

 అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో జమ్మూకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన దాయాదికి భారత్‌ గట్టిగా బుద్ధిచెప్పింది. ఉగ్ర దాడులతో పారిన రక్తంతో వారి చేతులు తడిసిపోయాయని న్యూదిల్లీ మండిపడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ‘నేను మరీ యవ్వనంగా కనిపిస్తున్నానట..!’ వైద్యపరీక్షల అనంతరం బైడెన్ చమత్కారం

వయసురీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఆటంకంగా మారాయి. అధ్యక్ష ఎన్నికల వేళ..  తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీకి ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏడాదికొకసారి నిర్వహించే వైద్యపరీక్షలు చేయించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. బ్యాలెట్ల నుంచి ఈవీఎం వరకు.. 75 ఏళ్ల ఈసీ ప్రయాణమిలా..!

18వ లోక్‌సభ ఏర్పాటు కోసం సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల తేదీలపై చర్చలు, ఈవీఎంల పరిశీలన వంటి పనుల్లో బిజీగా ఉంది. ఇంతకీ ఈసీ (EC)ని ఎప్పుడు ఏర్పాటుచేశారు..?గత 75 ఏళ్లలో ఎన్నికల నిర్వహణలో ఎలాంటి మార్పులొచ్చాయి..? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఇది ‘లీప్‌’ న్యూస్‌పేపర్‌.. నాలుగేళ్లకోసారి వచ్చే పత్రిక తెలుసా..?

సాధారణంగా వార్తాపత్రికలు ప్రతి రోజు వస్తుంటాయి. లేదా కొన్ని ప్రత్యేక వీక్లీ, మంత్లీ, ఇయర్లీ మ్యాగజైన్‌లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. కానీ, ఫ్రాన్స్‌లో ఓ న్యూస్‌పేపర్‌ మాత్రం నాలుగేళ్ల కోసారి మాత్రమే వస్తుంది. ప్రతి లీప్‌ సంవత్సరంలో దాన్ని ప్రచురిస్తుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. తల్లి కాబోతున్న దీపికా పదుకొణె.. ఇన్‌స్టాలో వెల్లడించిన నటి

 బాలీవుడ్‌లో బెస్ట్‌ కపుల్‌గా పేరున్న దీపికా-రణ్‌వీర్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. తాము తల్లిదండ్రులు కానున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. సెప్టెంబర్‌లో డెలివరీ డేట్‌ ఇచ్చినట్లు దీపిక పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతోంది. దీంతో సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్‌ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ప్రత్యేక దేశం వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ ఎంపీపై నిర్మలమ్మ ఫైర్‌

దేశ విభజన వ్యాఖ్యలు చేసిన కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేశ్‌పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీతారామన్‌ నిధుల కేటాయింపుపై వివరణ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. బీసీసీఐ నిర్ణయం వల్లే.. దేశవాళీ క్రికెట్‌ ఇంకా బతికి ఉంది: ఉన్ముక్త్‌ చంద్

విదేశీ లీగుల్లో ఆడేందుకు భారత క్రికెటర్లకు బీసీసీఐ అనుమతి ఇవ్వకపోవడమే మంచిదైందని అండర్-19 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ కెప్టెన్ ఉన్ముక్త్‌ చంద్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అతడు యూఎస్‌ క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని