Top 10 News 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 26 Mar 2024 21:19 IST

1. ఇంటింటి ప్రచారానికీ అనుమతి తీసుకోవాల్సిందే: ఈసీ

సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు సువిధ పోర్టల్‌ వినియోగించాలని సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలోని ఈసీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

2. వారి స్ఫూర్తితో.. పార్టీ కోసం పవన్‌ కల్యాణ్‌ రూ.10 కోట్ల విరాళం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ కోసం రూ.10 కోట్ల విరాళం ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం అందజేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన చెక్కును పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు సమక్షంలో కోశాధికారి ఎ.వి.రత్నంకి అందజేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

3. బీటెక్‌ చేశారా? భారీ వేతనంతో ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు!

ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారికి గుడ్‌న్యూస్‌. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. హైదరాబాద్‌తో పాటు పలు జోనల్‌ కార్యాలయాలు, ప్రాజెక్టు సైట్‌లలో పనిచేసేందుకు  మొత్తం 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

4. ఓటర్లకు తాయిలాలు.. భారీగా పట్టుబడ్డ వైకాపా బహుమతులు!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైకాపా.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాలకు తెరలేపింది. తాయిలాలు పంచి ఓట్లు కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. రేణిగుంటలో భారీగా జగన్‌ ఫొటో ముద్రించిన గడియారాలు, గొడుగులు లాంటి వస్తువుల లోడుతో ఉన్న లారీని తెదేపా నేతలు పట్టుకున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

5. ఒకే కుటుంబం.. 1,200 మంది ఓటర్లు.. అభ్యర్థుల దృష్టంతా వీరిపైనే!

లోక్‌సభ ఎన్నికల వేళ.. అస్సాంలోని తేజ్‌పూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నేపాలీ పామ్‌ గ్రామం వార్తల్లో నిలిచింది. ప్రచారంలో భాగంగా స్థానిక అభ్యర్థులు ఈ పల్లె బాటపట్టారు. కారణం.. ఈ గ్రామంలో నివసించే వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారే. రాన్‌ బహదూర్ అనే గోర్ఖా ఇక్కడి సోనిత్‌పూర్ జిల్లాలో స్థిరపడ్డారు. వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

6. ఉప్పల్‌ మ్యాచ్‌.. ప్రేక్షకులు వీటిని తీసుకురావొద్దు : పోలీస్‌ కమిషనర్‌

 ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ కోసం 2,500 మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి తెలిపారు. బుధవారం రాత్రి  ముంబయి ఇండియన్స్‌- సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. స్టేడియం వద్ద 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

7. జీపీఎస్‌ జామింగ్‌.. యూరప్‌లో వందల విమానాలపై ఎఫెక్ట్‌!

విమానాలకు అత్యంత కీలకమైన నావిగేషనల్‌ సిగ్నల్స్‌కు సంబంధించి యూరప్‌లో కొంతకాలంగా తరచూ ఆటంకాలు ఎదురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా తూర్పు యూరప్‌లో జీపీఎస్‌ జామింగ్‌  తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గడిచిన రెండు రోజుల్లోనే దాదాపు 1600లకు పైగా విమానాలు వీటి బారిన పడినట్లు జీపీఎస్‌ ట్రాకింగ్‌ సైట్లు పేర్కొంటున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

8. ప్రయాణికుల రద్దీ.. 32 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే(SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే పలు ప్రాంతాల మధ్య సేవలందిస్తోన్న 32 ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది. ఈ రైళ్లు ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు నిర్దేశిత తేదీల్లో సర్వీసులందిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

9. మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో సౌదీ అరేబియా.. తొలిసారి ప్రాతినిధ్యం!

ఫ్యాషన్‌ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావించే మిస్‌ యూనివర్స్‌ పోటీలకు సౌదీ అరేబియా సిద్ధమైంది. రూమీ అల్కహ్తాని అనే 27ఏళ్ల అందాల భామ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా రూమీ వెల్లడించారు. అంతర్జాతీయ వేదికగా జరిగే ఓ అందాల పోటీల్లో పాల్గొనే తొలి సౌదీ యువతిగా నిలవనుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

10. మహీంద్రా యూనివర్సిటీకి రూ.500కోట్లు.. ప్రకటించిన ఆనంద్‌ మహీంద్రా

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మహీంద్రా యూనివర్సిటీకి సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా కీలక ప్రకటన చేశారు. ఈ విశ్వవిద్యాలయానికి రూ.500కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే ఐదేళ్లలో తమ కుటుంబం ఈ మొత్తాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని