Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 15 Apr 2024 08:59 IST

1. వైకాపా సబ్బులు.. ఒళ్లంతా దురదలు

వైకాపా నాయకుల ప్రలోభాలు ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా కొద్ది రోజుల నుంచి తన అనుచరగణంతో తమ కంపెనీ సబ్బులను పంపిణీ చేయించారు. ఒక్కొక్క ఇంటికి 9 సబ్బులు అందజేసి తమ కుమార్తెకు ఓట్లు వేయాలని చెప్పిస్తున్నారు. పూర్తి కథనం

2. కమలం కల నెరవేరేనా?

తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా కసరత్తు చేస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా లోక్‌సభ విషయంలో ఓటర్ల నుంచి భాజపాకు సానుకూలత ఉంటుందన్న అంచనాతో ముందుకు కదులుతోంది. తమకు వచ్చే ఓట్లకు తోడు.. అధికార కాంగ్రెస్‌, విపక్ష భారాసల ఓట్లు చీలితేనే కమలానికి విజయావకాశాలు ఉంటాయి. పూర్తి కథనం

3. జగనన్న పాలనలో తాగండి.. తూగండి..!

ఎన్నికల ముందు సీఎం జగన్‌ ఇచ్చిన మద్య నిషేధం హామీని అధికారంలోకి రాగానే తుంగలో తొక్కేశారు. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని.. ఆదాయం గడించేందుకే అధిక ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో ఏదో చేస్తున్నామని మభ్య పెట్టి.. తెర వెనుక గొలుసు(బెల్టు) దుకాణాలను ప్రోత్సహించారు.పూర్తి కథనం

4. చెవులకు చిల్లు.. గుండె ఝల్లు

నగరంలో శబ్ద కాలుష్యం రోజురోజుకు తీవ్రమవుతోంది. వాహనాల హారన్లు, చెవులు చిల్లులు పడేలా సైలెన్సర్లు, నివాసాల మధ్య డీజే హోరుతో గూబ గుయ్‌మంటోంది. ప్రధానంగా జూబ్లీహిల్స్‌ నివాసిత ప్రాంతాల్లో పరిమితికి మించి నమోదవుతోంది. పూర్తి కథనం

5. అందుబాటు ధర ఇళ్ల వాటా తగ్గుతోంది

దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అమ్ముడవుతున్న నివాసాల్లో, రూ.45 లక్షల వరకు పలికే అందుబాటు ధర ఇళ్ల వాటా తగ్గుతోంది. ఈ ఏడాది జనవరి-మార్చి అమ్మకాల్లో ఈ విభాగ వాటా 22 శాతమేనని హౌసింగ్‌ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌ టైగర్‌ తాజా నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో విలాస ఫ్లాట్లకు గిరాకీ పెరుగుతోందని తెలిపింది.పూర్తి కథనం

6. నగరిలో జబర్దస్త్‌ దోపిడీ

‘నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే జబర్దస్త్‌ రోజా ఇంట్లో మొత్తం నలుగురు మంత్రులు ఉన్నారు. రోజా, ఆవిడ భర్త, ఇద్దరు అన్నలు కలిసి యథేచ్ఛగా ఇసుక మాఫియా, ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్నారు.. ఈసారి మంత్రి రోజా ఓడిపోతారు’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు.పూర్తి కథనం

7. సామాజిక మాధ్యమాల్లో.. జర జాగ్రత్త!

చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. ఇంకేముంది ఇష్టం వచ్చినట్లుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతామని అనుకుంటున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడక తప్పదు. మత, రాజకీయ, వ్యక్తిగత అంశాలకు సంబంధించి ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి పోస్టులు పెట్టినా పోలీసు కేసులను ఎదుర్కోవాల్సిందే.పూర్తి కథనం

8. మీకో దండం.. ఎలా పిండ ప్రదానం..?

పిండప్రదానం చేయడం.. పితృదేవతలకు తర్పణం వదలడం.. ప్రతి హిందువుడి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం.. తద్వారా వారి పూర్వీకుల ఆశీస్సులు కుటుంబంపై పుష్కలంగా ఉంటాయని ఆశపడుతుంటారు.. అందుకోసం కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధపడుతుంటారు. ఆ కార్యక్రమం చేసే అరుదైన ప్రాంతాల్లో  పిఠాపురంలోని పాదగయ కూడా ఒకటి.పూర్తి కథనం

9. రుణం చెల్లించలేదని రూ.4 కోట్ల కారు దహనం

బాకీ చెల్లించలేదని విలువైన కారును దహనం చేసిన ఘటన ఇది. పహాడీషరీఫ్‌ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నార్సింగికి ·చెందిన వ్యాపారి నీరజ్‌కు రూ.4 కోట్ల స్పోర్ట్స్‌ కారు ఉంది. దాన్ని విక్రయిస్తానని మొఘల్‌పురాకు చెందిన మిత్రుడు అమన్‌కు తెలిపాడు. శనివారం అహ్మద్‌ కారును కొనడానికి మామిడిపల్లిలోని తన ఫాంహౌస్‌కు తెమ్మన్నాడు.పూర్తి కథనం

10. మంత్రి గారూ.. శిలాఫలకం చూశారేంటి!

రాజానగరం మండలం కలవచర్లలో వంద ఎకరాలలో పారిశామ్రికవాడ ఏర్పాటుచేస్తామని.. 369 యూనిట్లు నెలకొల్పడం ద్వారా ఐదువేల మందికి ఉపాధి దొరుకుతుందని గత నెల 12న మంత్రి గురువాడ అమరనాథ్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని