Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Apr 2024 09:12 IST

1. జగనాసురుల కన్ను పడితే.. జగద్రక్షకుడి ఆస్తులు గోవిందా

వైకాపా సర్కారు కొలువు తీరిన తర్వాత దేవాదాయ భూములకు రెక్కలు వచ్చాయి. అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు ఆలయాల భూములను ఆక్రమించుకుంటున్నారు.. రికార్డులను తారుమారు చేసి తమ పేరిట పట్టాలు మార్చేసి దేవుడికే తిరిగి శఠగోపం పెట్టేస్తున్నారు. ఇదేమి తీరు అని అడిగితే కోర్టుల్లో కేసులు వేసి అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నారు. పూర్తి కథనం

2. ప్రయాణికులు ఫుల్‌.. ఎంఎంటీఎస్‌లు నిల్‌

ఒకప్పుడు 1.20 లక్షల మంది ప్రయాణికులున్న ఎంఎంటీఎస్‌ ఇప్పుడు 40 వేలకే పరిమితమైంది. గతంలో 45 కిలోమీటర్లు 120 సర్వీసులు ఉండగా.. ఇప్పుడు రెండోదశ అందుబాటులోకి వచ్చాక 145 కిలోమీటర్లకు   పరుగులు పెరిగినా.. కేవలం వందలోపు సర్వీసులతో సరిపెడుతున్నారు. పూర్తి కథనం

3. ఇంకా వారం కాలేదా జగన్‌?

మాటలతో గారడీ చేయడం సీఎం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య. 2019లో ఎన్నికల ముందు ఆయన చేసిన శుష్క వాగ్దానాల బుట్టలో పడినవారిలో ప్రభుత్వ ఉద్యోగులు మొదటి వరుసలో ఉన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి.. ఓట్లు వేయించుకున్న జగన్‌ అధికారంలోకి రాగానే మొండిచేయి చూపారు. పూర్తి కథనం

4. కంటోన్మెంట్ పోరు అభ్యర్థులు ఖరారు

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. దీంతో పోరు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్‌, భారాసలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. భాజపా మంగళవారం ఖరారు చేసింది. మొత్తం మీద మూడు పార్టీల మధ్య పోరు హోరాహోరీగా మారింది.పూర్తి కథనం

5. పంచాయతీలపై జగన్‌ పగ

పల్లెసీమల అభివృద్ధికి రూపాయి ఇవ్వని జగన్‌ ప్రభుత్వం.. కేంద్రం ఇచ్చిన నిధులనూ దారి మళ్లించింది. పంచాయతీల ఖాతాల్లో కేంద్రం నిధులు జమైన వెంటనే లాగేసుకున్నారు. నిధులు వస్తాయనే నమ్మకంతో సొంత డబ్బులతో పనులు చేసిన సర్పంచులు అప్పుల్లో కూరుకుపోయారు. పూర్తి కథనం

6. చందా సరిగా కట్టరు.. కార్మికులకు వైద్యసేవలు అందవు..!

కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) పరిధిలోకి వచ్చే కార్మికులకు వైద్యసేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. కార్మికుల వైద్యసేవల బీమా చందా సొమ్ము సక్రమంగా చెల్లించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనుంది. పాక్షికంగా చెల్లించే యాజమాన్యాలను గుర్తించడంతో పాటు మూసివేసిన సంస్థల వివరాలను పరిశీలించి ఎలాంటి బకాయిలు లేకుంటే వాటిని డేటాబేస్‌ నుంచి తొలగించాలని స్పష్టం చేసింది.పూర్తి కథనం

7. జూన్‌ 8-11 మధ్య నైరుతి రుతుపవనాల ప్రవేశం

రానున్న వానాకాలంలో రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం మించి అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండతోపాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని కొంత భాగంలో అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.పూర్తి కథనం

8. మునుపెన్నడూ లేనంత తక్కువగా.. 326 సీట్లలోనే కాంగ్రెస్‌ పోటీ..

దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్‌.. మునుపెన్నడూ లేనంత తక్కువగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 326 స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటివరకు 281 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో మూడు నియోజకవర్గాలు సహా ఇతర సీట్లకు ఇంకా ప్రకటించాల్సి ఉంది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో హస్తం పార్టీ 417 స్థానాల్లో పోటీ చేసింది.  పూర్తి కథనం

9. అన్నంత పనిచేశావ్‌... అంతం చేసేశావ్‌..!

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు... శత్రువైనా సరే ఆకలితో వస్తే కడుపు నిండా భోజనం పెట్టడం ధర్మం. అలాంటి అన్నాన్నే పేదలకు దూరం చేసి జగన్‌ ప్రభుత్వం పాపం మూటగట్టుకుంది. పేదలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ సమకూర్చడం ప్రభుత్వాల బాధ్యత. గత ప్రభుత్వాలు వివిధ పథకాల కింద తక్కువ ధరకే భోజనం అందించాయి.పూర్తి కథనం

10. అయోధ్య రాముడికి నేడు సూర్యతిలకం

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ ‘సూర్య’తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని