Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Apr 2024 09:13 IST

1. జగన్‌ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!

ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్‌ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. ధరలు పెరిగినంత వేగంగా తమ ఆదాయాలు పెరగలేదని, ఏటా సరకులు ధరలు అమాంతం పెరగడం వల్ల వంటింటి ఖర్చులు రెట్టింపు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి కథనం

2. పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని

శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. రాజధాని పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు.పూర్తి కథనం

3. ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం

ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్‌ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. పూర్తి కథనం

4. నాకింత... నీకింత

గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్‌ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్‌ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.పూర్తి కథనం

5. అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. మహిళలకు ఉపాధి కల్పించి, సొంత కాళ్లపై నిలబడేలా చేయడం.. వారిని సాధికారత దిశగా అడుగులు వేయించడంలో అతి ముఖ్యమైనది. అలా మహిళలకిచ్చే భరోసా వారి కుటుంబాలకే కాదు రాష్ట్ర ప్రగతికీ తిరుగులేని దన్నుగా నిలుస్తుంది.పూర్తి కథనం

6. బడాయి మావయ్యా.. బువ్వ.. గుడ్డు ఏదయ్యా

మీకు అన్నను.. మీ పిల్లలకు మావయ్యను అని చెప్పుకొని తిరిగే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆ మాటలను నిజం చేసుకోలేకపోయారు. ఈ ఐదేళ్లూ పిల్లలకు నాసిరకం భోజనాలే అందించారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం పేరు మార్చేసిన అన్న.. కొత్త మెనూ పేరుతో నాటకానికి తెరదీశారు.పూర్తి కథనం

7. అగ్రనేతల ఆగమనం

భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. చేసిన అభివృద్ధిని వివరించేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. హామీల అమలును ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.. మొత్తానికి తమ ఉపన్యాసాలతో మాటల తూటాలు పేల్చనున్నారు. పూర్తి కథనం

8. ఉద్యోగుల సొమ్ము.. జగన్‌ వమ్ము

ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్‌ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్‌ జమానాలో నరకం అనుభవించారు. ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వకుండా భయపెట్టే ప్రయత్నం చేసింది.పూర్తి కథనం

9. ‘పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి’

‘నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉందని’ కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు విజ్ఞప్తి చేశారు.పూర్తి కథనం

10. ఈపీఎస్‌ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?

ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్‌) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్‌వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని