Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 May 2024 09:13 IST

1. ఐదేళ్లు.. రూపాయి విదిల్చితే ఒట్టు!

రాష్ట్ర విభజనకు ముందు 2010-11లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ను మంజూరు చేసింది. ఇది అందుబాటులోకి వస్తే అటు సికింద్రాబాద్‌- గుంటూరు, గూడూరు- కాట్పాడి లైన్లు కలుస్తాయి. ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించడంతోపాటు సరకు రవాణా వేగవంతమవుతుందని భావించారు. 308.7 కి.మీ మేర సాగే ఈ మార్గానికి రూ.2,643.35 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. పూర్తి కథనం

2. మడతల చొక్కా వేసుకో.. పర్యావరణాన్ని కాపాడుకో

ఎండలైనా, వానలైనా అసాధారణంగా ఉంటున్నాయి. ఎందుకిలా అని వాతావరణ శాస్త్రవేత్తలను అడిగితే పర్యావరణ మార్పుల ప్రభావం అంటున్నారు. తగ్గించేందుకు మన వంతుగా ఏమైనా చేయవచ్చా అని ఆలోచించిన శాస్త్రవేత్తలు.. ఓవైపు ల్యాబ్‌ల్లో ప్రయోగాలు చేస్తూనే.. మరోవైపు వ్యక్తిగతంగా వస్త్రధారణతో ఇతరుల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. వారంలో ఒకరోజు ఇస్త్రీ చేయని వస్త్రాలు ధరిస్తున్నారు.   పర్యావరణానికి కలిగే మేలును ప్రచారం చేస్తున్నారు.  పూర్తి కథనం

3. ఆసక్తికరం.. 1.75 కోట్ల పందెం

ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. వారిపై ఆశలతో బెట్టింగురాయుళ్లు పెద్దఎత్తున పందేలు కాస్తున్నారు. పేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు భారీస్థాయిలో నగదు పందెం కాయడం అందరిలో ఆసక్తి రేపింది. రాజగోపాలపురం, రత్నాయంపేట (పెద్దూరు) గ్రామాలకు చెందిన ఇద్దరు  తెదేపా, వైకాపా విజయావకాశాలపై రూ.కోట్లలో పందెం కట్టారు. పూర్తి కథనం

4. పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్‌!

వెంకటాచలం మండలం కంటేపల్లిలో వైకాపా ప్రభుత్వం జగనన్న కాలనీ ఏర్పాటు చేసి.. స్థలాలు మంజూరు చేసింది. లబ్ధిదారుల్లో అత్యధికులు నిరుపేదలు కావడంతో ఇళ్లు నిర్మించుకోలేదు. దీంతో అధికారులు, స్థానిక నాయకుల సూచనలతో ఇళ్ల నిర్మాణ బాధ్యతను ఓ గుత్తేదారుకు అప్పగించారు. సదరు వ్యక్తి సుమారు వంద గృహాల వరకు నిర్మించేందుకు ముందుకొచ్చారు.పూర్తి కథనం

5. ఎటు చూసినా ఏఐ...

మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 92 శాతం మంది నిపుణులు తమ కార్యాలయాల్లో ఏఐని వినియోగిస్తున్నట్లు తాజాగా ‘మైక్రోసాఫ్ట్, లింక్‌డిన్‌ 2024 వర్క్‌ ట్రెండ్‌ ఇండెక్స్‌’  నివేదిక వెల్లడించింది.పూర్తి కథనం

6. ఆర్‌ఆర్‌ఆర్‌ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!

హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. ప్రాంతీయ రింగు రోడ్డు దక్షిణ భాగంలోని కొంత నర్సాపూర్‌ రిజర్వు ఫారెస్ట్‌ నుంచి వెళ్లేలా ఎలైన్‌మెంట్‌ను రూపొందించారు.పూర్తి కథనం

7. జగనన్న పాపం.. రైతులకు శాపం

ప్రభుత్వ ప్రచార పిచ్చి.. అధికారుల నిర్లక్ష్యంతో  రీసర్వేలో జరిగిన పొరపాట్లు రైతులకు శాపంగా మారుతున్నాయి. కొత్త పాసుపుస్తకాల్లో తప్పుల కారణంగా పంట రుణాల నవీకరణకు రైతులు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల రెన్యువల్‌ చేయబోమని బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు.  కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులకు రుణాల మంజూరులో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. రీసర్వే జరిగిన గ్రామాల్లో 1బీ, అడంగల్‌ పత్రాలకు సంబంధించి గందరగోళం నెలకొంది.పూర్తి కథనం

8. ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్‌ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. తప్పు చేసిన వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉన్నవారైనా సరే ధైర్యంగా చర్యలు తీసుకునే డీఎన్‌ఏ ప్రస్తుత ఈసీలో లేదంటూ విమర్శించింది. పూర్తి కథనం

9. అది నేనే... ఇది నేనే!

దాదాపు పాతికేళ్ల కిందట... ఐశ్వర్యారాయ్‌ నటించిన ‘జీన్స్‌’లో ‘కన్నులతో చూసేదీ గురువా..’ పాటలో హీరోయిన్‌తోపాటు ఆమె ప్రతిబింబం - అదేనండీ, డిజిటల్‌ రూపం కూడా కలిసి డ్యాన్స్‌ చేయడం చూసినప్పుడు భలే థ్రిల్లింగ్‌గా అనిపించింది కదూ. మనకీ అలా మారు రూపం ఉంటే బాగుంటుందని అప్పుడు ఎంతమంది అనుకున్నారో ఏమో కానీ ఇప్పుడది అందుబాటులోకి వచ్చింది. అదే ‘డిజిటల్‌ క్లోన్స్‌’. హోలిస్టిక్‌ గురు, హెల్త్‌ గురుగా పేరున్న దీపక్‌ చోప్రా కొన్నిరోజుల క్రితం తనని పోలిన డిజిటల్‌ క్లోన్‌ను తయారుచేయించుకుని ఓ కార్యక్రమానికి హాజరుపరిచి వార్తల్లో నిలిచాడు.పూర్తి కథనం

10. ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి

ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కొత్త ఇసుక పాలసీ అమలు చేస్తామని చెప్పిన సీఎం జగన్‌ భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడేలా చేశారని విమర్శించారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని