Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 May 2024 09:16 IST

1. అభ్యర్థుల నోటా.. ఆందోళన మాట

సార్వత్రిక ఎన్నికలు-2024 జిల్లాలో హోరాహోరీగా జరిగాయి. పోలింగ్‌ శాతమూ బాగా పెరిగింది. ఈ ఓట్లన్నీ తమకే అనుకూలమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ పోటాపోటీగా ఓట్లు పోలయ్యాయని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎన్నికల్లో నోటాకు స్థానం ఉండటంతో ఆందోళన కలిగించే అంశమే. బరిలో నిలిచే అభ్యర్థులు ఓటర్లకు నచ్చకుంటే.. నోటాకు ఓటు వేసే అవకాశం ఉంది. పూర్తి కథనం 

2. బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్‌

కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. ప్రచారంలో ప్రతిగింజకు బోనస్‌ అని ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అంటారా? అని ప్రశ్నించారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం, దగా, నయవంచన అన్నారు. నీరివ్వరు.. కరెంట్‌ ఇవ్వరు.. పంట కూడా సరిగా కొనుగోలు చేయరా? అని నిలదీశారు.పూర్తి కథనం 

3. కొంతమంది పోలీసుల తీరుతోనే.. హింసాకాండ

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఈనెల 13వ తేదీ, తర్వాత రోజు పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్‌ దర్యాప్తు బృందం విచారణ చేసింది. శని, ఆదివారం రెండురోజుల పాటు సిట్‌ అధికారులు నరసరావుపేట, రెంటచింతల, దాచేపల్లి స్టేషన్లతో పాటు పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ రోజున ఏం జరిగింది? గొడవలు, అలర్లకు కారణాలేమిటి? ఆ ఘటనల్లో నాయకుల పాత్ర ఏమిటి? పోలీసులు వాటిపై ఎన్ని కేసులు నమోదు చేశారో స్టేషన్లకు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు.పూర్తి కథనం 

4. గుండె లయ తప్పుతోంది..!

ఒకరిద్దరు కాదు.. ఉమ్మడి జిల్లాలో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ కొందరు ఆకస్మికంగా మరణిస్తున్నారు. మరికొందరు ఆసుపత్రులపాలవుతున్నారు. గతంలో 50 ఏళ్లు దాటిన వారిలో లక్షణాలు కనిపించేవి. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చిన్ననాటి నుంచే ముప్పు వెంటాడుతోంది.పూర్తి కథనం 

5. ఊరికో వైకాపా మారీచుడు

వైకాపా నేతలు ఇసుక, మట్టిలో తెగ మేశారు. సహజ వనరులను కొల్లగొట్టి నమిలి మింగారు. దొంగలు దొంగలూ కలిసి ఊళ్లు పంచుకున్నట్లు- జిల్లాలో అధికారికంగా ఒక్క రీచ్‌ కూడా లేకున్నా.. ఇసుక లభించే ప్రాంతాలను పంచేసుకున్నారు. అనుకూలురకు అప్పగించి ఇనప్పెట్టెలు నింపుకొన్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు కన్నెత్తి చూడలేదు.పూర్తి కథనం 

6. దిల్లీ మెట్రో రైళ్లలో కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ రాతలు

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై బెదిరింపుల వెనుక భాజపా హస్తం ఉందని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సోమవారం ఆరోపించింది. దిల్లీలోని మెట్రో రైళ్లలో కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ కొన్ని రాతలు (గ్రాఫిటీ) వెలసిన నేపథ్యంలో ఆప్‌ ఈ మేరకు స్పందించింది. ఈ అంశంపై చర్చించేందుకు తమకు సమయం కేటాయించాలంటూ ఎన్నికల కమిషన్‌కు ఈ-మెయిల్‌ ద్వారా విజ్ఞప్తి చేసింది.పూర్తి కథనం 

7. ప్రాదేశిక సమరంపై సందిగ్ధత

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియగా ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. మరోవైపు స్థానిక సమరంలో కీలకమైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడంతో ప్రస్తుతం అందరి దృష్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పడింది. మరో నెలన్నర రోజుల్లో ప్రస్తుత సభ్యుల పదవీ కాలం గడువు ముగియనుండగా ఇప్పటివరకు ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల విషయంలో జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది.పూర్తి కథనం 

8. ప్రశాంత పల్నాడులో వైకాపా అశాంతి రేపింది

ప్రశాంత పల్నాడులో వైకాపా నేతలు అశాంతి రేపారని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ధ్వజమెత్తారు. కొంతమంది పోలీసు అధికారులతో వారు కుమ్మక్కై తెదేపా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారని మండిపడ్డారు. అధికారుల్ని మార్చినచోటే అల్లర్లు జరిగాయంటూ వైకాపా దుష్ప్రచారం చేస్తోందని ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు.పూర్తి కథనం 

9. టీజీ 09 9999.. రూ.25.50 లక్షలు

రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు ఏకంగా రూ.25.50 లక్షల రాబడి వచ్చింది. ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్‌ ప్రారంభమైన సందర్భంగా ఆన్‌లైన్‌ వేలం నిర్వహించారు. టీజీ09 9999 నంబరును సోని ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్‌ తమ టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ ఎల్‌ఎక్స్‌ కోసం రూ.25,50,002 చెల్లించినట్లు హైదరాబాద్‌ జేడీసీ సి.రమేశ్‌ తెలిపారు. పూర్తి కథనం 

10. మళ్లీ ఊపందుకున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు

ఎన్నికల నేపథ్యంలో స్తబ్దుగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలు అరెస్టు కాగా.. ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు పూర్తికావాలంటే వీరిని విచారించడం తప్పనిసరి.పూర్తి కథనం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని