Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 May 2024 09:08 IST

1. సర్దుపోటు తప్పదా..?

ఈ నెలలో వచ్చిన బిల్లులో 22వ వాయిదాను మోపారు. ఇంకా 14 నెలల పాటు వినియోగదారులు భరించాల్సి ఉంది. దీంతో పాటు ఎఫ్‌పీపీసీఏ -2 భారాన్ని కూడా కొనసాగిస్తున్నారు. 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సంబంధిత నెలలో వాడుకున్న విద్యుత్తుపై తర్వాతి నెలలో వచ్చే బిల్లులో లెక్కించి ఎఫ్‌పీపీసీఏ 2 ఛార్జీలు విధిస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు 40 పైసలు చొప్పున లెక్కించి వసూలు చేస్తున్నారు. పూర్తి కథనం

2. గంభీర్‌ రాకతో.. కేకేఆర్‌ కథ మారిందిలా..

ఈ ఐపీఎల్‌ (IPL) ఆసాంతం ఛాంపియన్‌గా కనిపించిన జట్టేదయినా ఉంది అంటే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) మాత్రమే. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, మరోవైపు ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన ఆ జట్టు విజేతగా నిలవడంలో ఆశ్చర్యం లేదు. కానీ టోర్నీ ఆరంభానికి ముందు మాత్రం ఆ జట్టుపై పెద్దగా అంచనాలేమీ లేవు. మరి.. నిరుడు, అంతకుముందు ఏడాది ఏడో స్థానంతో సరిపెట్టుకున్న కోల్‌కతాలో ఈ మార్పెలా? ట్రోఫీ ఎలా ఆ జట్టు సొంతమైంది. పూర్తి కథనం

3. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌.. జూన్‌ 2 వరకే

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్లుగా.. పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉండాలన్న గడువు జూన్‌ 2తో ముగియనుంది. పూర్తి కథనం

4. కోర్టు షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారు

మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను పగలగొడుతూ అడ్డంగా దొరికిపోయిన కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ పొందిన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. తనపై నమోదుచేసిన మరో మూడు కేసులలో ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు ఆదివారం అత్యవసర విచారణ జరిపింది. వాదనల కొనసాగింపునకు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి కథనం

5. స్టార్క్‌ అంతే.. తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్‌ల్లోనే అద్భుత ప్రదర్శన

రూ.24.75 కోట్లు.. ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (Mitchell Starc) కోసం నిరుడు వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) వెచ్చించిన డబ్బు. ఐపీఎల్‌ (IPL) చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా మారిన స్టార్క్‌.. ఈ సీజన్‌లో మొదట అంచనాలను అందుకోలేకపోయాడు. పూర్తి కథనం

6. నమ్మించారు.. నిండా ముంచారు

గోదావరి వరదలకు 2021లో పోలవరం బ్యాక్‌వాటర్‌ రావడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం అతలాకుతలమైంది. ముంపు ప్రభావిత గ్రామాలతోపాటు దేవీపట్నం, పూడిపల్లి, కె.వీరవరం, తొయ్యేరు తదితర గ్రామాలవారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని మైదాన ప్రాంతాలకు పరుగులు తీశారు. ఆ తరువాత వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఏడాదిలోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లిస్తామని హామీల వర్షం కురిపించారు. పూర్తి కథనం

7. ఉసురు తీసిన గాలివాన

అకాలవర్షాలు, ఈదురుగాలులు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రెమాల్‌ తుపాను ప్రభావం ప్రజలను అతలాకుతలం చేసింది. అప్పటి వరకు ఎండ కాస్తూ... మధ్యాహ్నం ఉన్నట్లుండి భారీ ఈదురుగాలులు విరుచుకుపడటంతో వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృత్యువాతపడ్డారు. పూర్తి కథనం

8. వైకాపా కార్యకర్తల అరాచకం.. జనసేన నేత కారుకు నిప్పు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు అరాచకం సృష్టించారు. జనసేన నాయకుడు కర్రి మహేశ్‌ కారును తగులబెట్టారు. ఇంటిముందు పార్క్‌ చేసిన కారుకు నిప్పు పెట్టడంపై మహేశ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. పూర్తి కథనం

9. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం..

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్‌ జరగనుంది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతోంది. పూర్తి కథనం

10. అమెరికాలో టోర్నడోల బీభత్సం

అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేస్తున్నాయి. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీటి ధాటికి ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. టెక్సాస్‌లో ఓక్లహామా సరిహద్దుకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో టోర్నడో బీభత్సానికి ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పూర్తి కథనం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని