Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Jun 2024 21:15 IST

1. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు: రాకేశ్‌రెడ్డి

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయని భారాస అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ఆరోపించారు. ఓట్ల లెక్కింపు ఏకపక్షంగా జరుగుతోందని విమర్శించారు. కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండానే లీడ్ ప్రకటించారన్నారు. పూర్తి కథనం

2. నా కోసం ట్రాఫిక్‌ ఆపొద్దు.. ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు: చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు గురువారం రాత్రి దిల్లీ బయల్దేరారు. తన పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్‌ ఆపవద్దని నిన్నే అధికారులకు స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలను ఆయన భద్రతా సిబ్బంది గుంటూరు, విజయవాడ పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు  పూర్తి కథనం

3. పల్నాడు ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి.. అరెస్టుపై ఉత్కంఠ

వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై పల్నాడులో ఉత్కంఠ నెలకొంది. జూన్‌ 6వ తేదీ వరకు రోజూ ఎస్పీ కార్యాలయంలో సంతకం చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గురువారం సాయత్రం ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లారు. పూర్తి కథనం

4. పవన్‌ కల్యాణ్‌ ‘థ్యాంక్స్‌ పోస్ట్‌’.. చిత్తశుద్ధితో ముందడుగేస్తాం

తన గెలుపుపై స్పందించి, శుభాకాంక్షలు చెప్పిన ప్రతిఒక్కరికీ జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కృతజ్ఞతలు తెలిపారు. తాము అందుకున్న విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. పూర్తి కథనం

5. ఒకే ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు.. స్టాయినిస్‌ విధ్వంసం చూశారా?

టీ20 ప్రపంచకప్‌ టోర్నీ (T20 World Cup 2024)ని ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. కెన్సింగ్టన్‌ ఓవల్‌ వేదికగా గురువారం ఒమన్‌ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌ (AUS vs OMAN) లో 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ (Marcus Stoinis) అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ ఆకట్టుకున్నాడు. పూర్తి కథనం

6. మారుతీ సుజుకీ ఆఫర్‌.. ఈ మోడళ్లపై రూ.74వేల వరకు తగ్గింపు

మారుతీ సుజుకీ (Maruti Suzuki) నెక్సా లైనప్‌లో తీసుకొచ్చిన మోడళ్లపై పెద్దఎత్తున డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇన్విక్టో మినహా అన్ని వాహనాలపై రాయితీ ఇస్తోంది. కొన్ని వాహనాలపై ఏకంగా రూ.74 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. పూర్తి కథనం

7. ‘స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌’లో మోదీ, షా.. రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు

ఎన్నికల ఫలితాల రోజు స్టాక్‌ మార్కెట్‌ (Stock market) చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ నష్టాలను మూటగట్టుకుంది. దీంతో సుమారు రూ.30లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ఈ ఉదంతంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. దీన్ని ‘అతిపెద్ద స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌’గా అభివర్ణించారు.  పూర్తి కథనం

8. ఏపీకి ప్రత్యేక హోదా.. ఆ హామీని ప్రధాని నెరవేరుస్తారా?: కాంగ్రెస్‌

ఆంధ్ర ప్రదేశ్‌, బిహార్‌లకు ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని ప్రధానమంత్రి నెరవేరుస్తారా? అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. మరోవైపు మోదీ 3.o ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నామని పదే పదే ప్రచారం జరుగుతోందని, కానీ, ఈసారి అది మోదీ 1/3 ప్రభుత్వమేనని విమర్శించింది. పూర్తి కథనం

9. తైవాన్‌ అధ్యక్షుడి పోస్ట్‌కు మోదీ స్పందన.. చైనా కడుపుమంట

భారత (India) సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi)కి ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. తైవాన్‌ (Taiwan) నూతన అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌ తే కూడా కంగ్రాట్స్‌ చెప్పగా.. ఆ పోస్ట్‌కు మోదీ బదులిచ్చారు. అయితే, దీన్ని చైనా (China) తట్టుకోలేకపోయింది. పూర్తి కథనం

10. గాజాలో శిబిరంపై దాడి.. 33 మంది మృతి!

గాజా (Gaza)లో వేలాదిమంది అమాయకుల మరణాలకు కారణమవుతోందని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతోన్నా.. ఇజ్రాయెల్‌ (Israel) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సెంట్రల్‌ గాజాలోని ఓ పాఠశాల భవనంపై జరిపిన వైమానిక దాడిలో.. అక్కడ తలదాచుకుంటున్న 33 మంది పౌరులు మృతి చెందారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు