Maruti Suzuki: మారుతీ సుజుకీ ఆఫర్‌.. ఈ మోడళ్లపై రూ.74వేల వరకు తగ్గింపు

Maruti Suzuki: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన నెక్సా లైనప్‌లో తీసుకొచ్చిన కొన్ని మోడళ్లపై రూ.74వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది.

Published : 06 Jun 2024 20:15 IST

Maruti Suzuki | ఇంటర్నెట్‌డెస్క్‌: మారుతీ సుజుకీ (Maruti Suzuki) నెక్సా లైనప్‌లో తీసుకొచ్చిన మోడళ్లపై పెద్దఎత్తున డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇన్విక్టో మినహా అన్ని వాహనాలపై రాయితీ ఇస్తోంది. కొన్ని వాహనాలపై ఏకంగా రూ.74 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. వివిధ మోడళ్లపై ఎక్స్ఛేంజ్‌ బోనస్‌లు, నగదు తగ్గింపులు, కార్పొరేట్‌ ప్రయోజనాలు కూడా అందిస్తోంది. జూన్‌ చివరి వరకు మాత్రమే ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. వేరియంట్లు, ట్రిమ్‌ల బట్టి ఈ ప్రయోజనాలు మారొచ్చు.

Grand Vitara: మారుతీ సుజుకీ అందిస్తున్న డిస్కౌంట్లలో గ్రాండ్ విటారా హైబ్రిడ్ మోడల్‌పైనే అత్యధిక రాయితీ పొందొచ్చు. ఏకంగా రూ.74వేల వరకు గణనీయమైన తగ్గింపుతో లభించనుంది. ఈ తగ్గింపులో రూ.20 వేలు డిస్కౌంట్‌తో పాటు, రూ.50వేలు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, రూ.4వేల వరకు కార్పొరేట్‌ ప్రయోజనాలను అందిస్తోంది.

Fronx: టర్బో- పెట్రోల్‌ వేరియంట్‌లో వచ్చిన ఫ్రాంక్స్‌పై కూడా రూ.74వేల వరకు ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులో రూ.15 వేల నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ రూ.10వేలు, కార్పొరేట్‌ డిస్కౌంట్ రూ.2వేలతో పాటు రూ.43వేల యాక్సెసరిటీ కిట్‌ ఉంటాయి. 1.2 లీటర్ల పెట్రోల్‌, సీఎన్‌జీ ట్రిమ్‌పై రూ.15వేల రాయితీ, రూ.10వేల వరకు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, రూ.2వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చు.

XL6: మారుతీ ఎక్స్ఎల్‌6 మోడల్‌లో పెట్రోల్ వేరియంట్‌పై రూ.30వేల వరకు మారుతీ రాయితీ అందిస్తోంది. ఇందులో రూ.10వేల వరకు క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.20 వేల వరకు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ ఉన్నాయి. ఇక సీఎన్‌జీ వేరియంట్‌పై ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ను రూ.10వేలకే పరిమితం చేసింది.

వివో కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌.. ధర రూ.లక్షన్నర పైనే!

Jimmy: జిమ్నీలోని అన్ని వేరియంట్లపై రూ.50వేల వరకు రాయితీ పొందొచ్చు. ఎటువంటి ఎక్స్ఛేంజ్‌, కార్పొరేట్‌ బోనస్‌ లేకుండానే ఈ డిస్కౌంట్‌ లభిస్తోంది. దీని ప్రస్తుత ధర రూ.12.74 లక్షల నుంచి రూ.14.95 లక్షల మధ్య ఉంది.

Ciaz: నెక్సా లైనప్‌లో తీసుకొచ్చిన మరో వాహనం సియాజ్‌పై రూ.48వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ రాయితీలో రూ.20వేల వరకు నగదు రాయితీ, రూ.25 వేల వరకు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, రూ.3 వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ ఉన్నాయి.

Baleno: రూ.40వేల నగదు తగ్గింపు, రూ.15వేల ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, రూ.2 వేల కార్పొరేట్‌ బోనస్‌తో కలిపి మొత్తం సుజుకీ బ్యాలెనో వేరియంట్‌పై రూ.57 వేల వరకు రాయితీ అందిస్తోంది. ఇందులోని ఎంటీ వేరియంట్‌పై డిస్కౌంట్‌ను రూ.35వేల వరకు మాత్రమే పరిమితం చేసింది.

Igins: ఇగ్నీస్‌పై కూడా బ్యాలెనోపై ఇస్తున్నట్లు గానే ఎంటీ వేరియంట్‌పై రూ.35వేల తగ్గింపు, ఏఎంటీపై రూ.40వేల రాయితీ పొందొచ్చు. దీంతో పాటు రూ.15వేలు ఎక్స్ఛేంజ్ బోనస్‌, రూ.2వేల వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని