Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 May 2024 13:24 IST

1. నరసరావుపేటలో ‘సిట్‌’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా

పల్నాడు జిల్లా నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో సిట్‌ బృందం దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల అల్లర్లకు సంబంధించిన వీడియోలను అధికారులు పరిశీలించారు. పోలింగ్‌ రోజు, తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ బృందం విచారణ జరిపింది. సిట్‌ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి కథనం

2. ప్రజ్వల్‌ రేవణ్ణపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ

మహిళలపై లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై (Prajwal Revanna) అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం శనివారం వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు విచారణకు హాజరు కాకపోవటంతో అధికారులు కోర్టును ఆశ్రయించారు.పూర్తి కథనం

3. జగన్‌ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు

గత ఐదేళ్లుగా జగన్‌ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) (AB Venkateswara Rao)కు పౌరసమాజం నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. #JusticeForABV పేరిట ఈ ఉద్యమం కొనసాగుతోంది. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్‌.ఓఆర్‌జీ’లో వేలాది మంది సంతకాలు చేస్తున్నారు.పూర్తి కథనం

4. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

బెంగళూరు నుంచి కొచ్చికి బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) విమానం శనివారం రాత్రి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. ఇంజిన్‌లో మంటలు చెలరేగడమే అందుకు కారణం. 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.పూర్తి కథనం

5. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 3కి.మీ మేర బారులు

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల వరకు బారులుదీరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని తితిదే ప్రకటించింది.పూర్తి కథనం

6. ట్రంప్‌నకు జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ మద్దతు..!

అమెరికాలో అతిశక్తిమంతమైన సంస్థగా పేరున్న జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఆర్‌ఏ) మద్దతు రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌న(Donald Trump)కు లభించింది. 2024 ఎన్నికల నేపథ్యంలో ఆయన టెక్సాస్‌లో వేల మంది ఎన్‌ఆర్‌ఏ సభ్యులను ఉద్దేశించి శనివారం ప్రసంగించారు. అంతకు కొద్ది సేపటి ముందే ఆ సంస్థ ట్రంప్‌నకు మద్దతు ప్రకటించింది. పూర్తి కథనం

7. మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్‌ రంజన్‌

పశ్చిమబెంగాల్‌లో ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య తీవ్రమైన పోరు జరుగుతోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధ్రీ  (Adhir Ranjan) టీఎంసీ అధినేత మమతా బెనర్జీపై పదునైన విమర్శలు చేస్తున్నారు. ఓ పక్క కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం సంయమనం పాటించమని సూచించినా..  అంగీకరించనని తేల్చిచెప్పారు. శనివారం రాత్రి మాట్లాడుతూ.. మమతా బెనర్జీ గురించి ఎట్టి పరిస్థితుల్లో సానుకూలంగా మాట్లాడలేనని పేర్కొన్నారు.పూర్తి కథనం

8. మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్‌ క్యాచ్‌.. యశ్ లాస్ట్ ఓవర్‌ వీడియోలు వైరల్!

వరుసగా ఆరో విజయం సాధించి ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు. కీలకమైన మ్యాచ్‌లో చెన్నైను ఆర్సీబీ ఓడించింది. తీవ్ర ఒత్తిడి ఉన్న ఈ పోరులో  మొదటి ఓవర్‌ నుంచి చివరి వరకూ బెంగళూరు పోరాటం ఆకట్టుకుంది. మరోవైపు చెన్నై కూడా ‘ప్లేఆఫ్స్‌’ కోసం శ్రమించినా సరిపోలేదు. మరి ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ను వీడియోల రూపంలో.. పూర్తి కథనం

9. జగన్ మెప్పు కోసం జనం కళ్లకు గంతలు కట్టిన ఐప్యాక్ ఉద్యోగులు

అమ్మ ఒడి అదుర్స్ అంటూ ఒకరు.. జగన్ మామయ్యే కావాలంటూ మరొకరు, మా సొంతింటి కల నేరవేర్చారంటూ ఆనంద భాష్పాలు రాల్చేదొకరు. చివరకు సూటు, బూటు వేసుకొచ్చి పెట్టుబడిదారులమంటూ కలరింగ్ ఇచ్చింది ఇంకొకరు. ఇలా పోటీపడిమరీ టాలెంట్ ప్రదర్శించిన వాళ్లంతాఒక గూటి పక్షులే. జగన్ మెప్పు కోసం జనం కళ్లకు గంతలు కట్టిన ఐప్యాక్ ఆర్టిస్టులే. ఎన్నికల్లో గెలవడం కోసం ఐప్యాక్ ఉద్యోగులు చేసిన ఆస్కార్ విన్యాసాలను తెలుగుదేశం సోషల్ మీడియా టీమ్‌ ఎండగడుతోంది.  పూర్తి కథనం

10. కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం: సీపీఐ నేత నారాయణ

కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఎన్డీయేకు 400 సీట్లు వస్తాయంటూ ప్రధాని మోదీ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని.. వాస్తవానికి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఉత్తర భారతదేశంలోనూ ఎన్డీయేకు భారీగా సీట్లు తగ్గనున్నాయని చెప్పారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని