Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 26 Feb 2024 13:03 IST

1. Vasantha Krishna Prasad: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరతా: వసంత కృష్ణప్రసాద్‌

రెండ్రోజుల్లో తాను తెదేపాలో చేరతానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఐతవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మైలవరం నియోజకవర్గంలో కార్యకర్తలందరితో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తాను. ఆయన సమక్షంలో తెదేపాలో చేరతా. దేవినేని ఉమతో నాకు వ్యక్తిగత ద్వేషాలు లేవు. తెదేపా అధిష్ఠానం సమక్షంలో దేవినేనితో కలిసి అన్నీ మాట్లాడుకుంటాం. పూర్తి కథనం

2. Two wheeler insurance: బైక్‌ ఇన్సూరెన్స్‌.. ఇవన్నీ తెలుసుకున్నాకే..!

ద్విచక్ర వాహనం కొనుగోలు అనేది చాలా మందికి ఒక ఎమోషన్‌. ఎంతో ఇష్టపడి నచ్చిన బైక్‌ను ఇంటికి తెచ్చుకొంటాం. ఆ తర్వాత దాని భద్రతకు బీమా కొనుగోలు విషయంలో మాత్రం సందిగ్ధంలో పడతాం. అనేక రకాల బీమాలు మార్కెట్‌లో అందుబాటులో ఉండటంతో ఏది సరైందో అర్థం కాదు. మీరు కూడా ఇలాంటి స్థితిలోనే ఉన్నారా? పూర్తి కథనం

3. BJP: కేసీఆర్‌పై కోపంతోనే కాంగ్రెస్‌కు ఓటేసిన తెలంగాణ ప్రజలు: ఈటల

అసెంబ్లీ ఎన్నికల్లో భారాస అధినేత కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. లోకసభ ఎన్నికల్లో మాత్రం భాజపాకే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. గజ్వేల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి కథనం

4. Lions Name controversy: సింహాలకు అక్బర్‌, సీత పేర్లు.. ఆ అధికారిపై వేటు

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని శిలిగుడి సఫారీ (Bengal Safari) పార్కులో అక్బర్‌, సీత పేర్లు కలిగిన మగ, ఆడ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడం ఇటీవల తీవ్ర వివాదానికి (Lions Name controversy) దారితీసిన విషయం తెలిసిందే. వాటికి ఆ పేర్లు పెట్టడంపై కలకత్తా హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కాస్తా దుమారం రేపడంతో త్రిపుర (Tripura) ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. పూర్తి కథనం

5. Israeli: ఇజ్రాయెల్‌ దౌత్యకార్యాలయం ఎదుట అమెరికా వాయుసేన ఉద్యోగి ఆత్మహత్యాయత్నం..!

అమెరికా వాయుసేనకు చెందిన ఓ ఉద్యోగి వాషింగ్టన్‌ డీసీలోని ఇజ్రాయెల్‌ దౌత్యకార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనకు ముందు అతడు తనను తాను ఆరోన్‌ బుష్‌నెల్‌గా పరిచయం చేసుకొన్నాడు. పూర్తి కథనం

6. MEA: రష్యా ఆర్మీ నుంచి భారతీయులందరినీ విడిపిస్తాం.. ‘అభ్యర్థన’ వార్తలు అవాస్తవమన్న విదేశాంగ శాఖ

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం (Ukraine-Russia War)లో కొంతమంది భారతీయులు (Indians).. మాస్కో సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీరంతా ఇప్పుడు రష్యా నుంచి బయటపడేందుకు సాయం కోరుతున్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. పూర్తి కథనం

7. T20 League: ఆ లీగ్‌.. ఓ సర్కస్‌ లాంటిది: బంగ్లాదేశ్‌ కోచ్‌ సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌ ప్రధాన కోచ్‌ చండికా హతురుసింఘా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ దేశంలో జరుగుతున్న టీ20 లీగ్‌ మ్యాచ్‌లను చూడకుండా టీవీని ఆపేసిన సందర్భాలున్నాయని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్ల మధ్య సరైన పోటీ వాతావరణం లేదని అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్ (BPL) వల్ల చాలా మంది క్రికెటర్లు వెలుగులోకి వచ్చినప్పటికీ.. అదేమంత గొప్ప టోర్నీ కాదని పేర్కొన్నాడు. పూర్తి కథనం

8. త్వరలో తెదేపాలో చేరుతున్నా: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ రాశారు.  ఐదేళ్లుగా తనపై చూపిన ప్రేమ, అభిమానం మరవలేనని ఆయన పేర్కొన్నారు. ‘‘పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయబోతున్నా. త్వరలో తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నా. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ మీ ముందుకొస్తున్నా. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పల్నాడు అభివృద్ధికి కృషి చేశా. మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తా’’ అని లేఖలో పేర్కొన్నారు.

9. Kalki: ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్‌ అందుకే పెట్టాం.. అసలు విషయం చెప్పిన నాగ్‌ అశ్విన్‌

ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది రానుంది. దీని టైటిల్‌ను ప్రకటించినప్పటి నుంచి ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రియుల్లోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర దర్శకుడు ఆ టైటిల్‌ పెట్టడానికి గల కారణాన్ని వెల్లడించారు. పూర్తి కథనం

10. ఎఫ్‌డీ కంటే అధిక వడ్డీ.. పైగా పన్ను మినహాయింపు.. VPF ప్రయోజనాలివే..!

ఉద్యోగం చేస్తున్నవారందరికీ ఎంప్లాయీస్‌ ప్రావిడెండ్‌ (EPF) గురించి తెలిసే ఉంటుంది. ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతాన్ని ఉద్యోగి భవిష్య నిధి ఖాతాకు (EPF) జమ చేస్తారు. అంతే మొత్తాన్ని సంస్థ జోడిస్తుంది. ఈ నిధిపై 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం చొప్పున వడ్డీని ఈపీఎఫ్‌ఓ ఖరారు చేసింది. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని