Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 03 Aug 2023 13:00 IST

1. ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే

ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపాలని సాయన్న పరితపించారు: కేసీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొంతకాలం క్రితం మృతిచెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు శాసనసభ నివాళులర్పించింది. సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్‌ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాయన్న లేని లోటు పూడ్చలేనిదన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎఫ్‌ఆర్వో హత్య కేసులో ఇద్దరికి జీవితఖైదు

ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు హత్య కేసులో ఇద్దరు నిందితులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో మడకం తుల, మిడియం నంగాలను న్యాయస్థానం దోషులుగా తేల్చింది. వారికి జీవితఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జ్ఞానవాపి మసీదులో సర్వే కొనసాగించండి: పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque)లో శాస్త్రీయ సర్వే వ్యవహారంపై అలహాబాద్‌ హైకోర్టు (Allahabad High Court) కీలక ఉత్తర్వులు వెలువరించింది. మసీదు ఆవరణలో సర్వే కొనసాగించేందుకు భారత పురావస్తు శాఖకు అనుమతినిచ్చింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి

మాజీ మంత్రి, సీనియర్‌ నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటు మాజీ  ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భర్తతో గొడవ.. బ్యూటీపార్లర్‌పై భార్య ఫిర్యాదు

పాతబస్తీకి చెందిన మహిళ.. మోడల్‌గా చూడాలనుకున్న తన భర్త కోరిక మేరకు బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. సదరు మహిళకు పార్లర్‌ సిబ్బంది హెయిర్‌ కట్‌ చేసి ఆయిల్‌ పెట్టారు. అనంతరం జుట్టు ఊడిపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో బ్యూటీపార్లర్‌పై అబిడ్స్‌ ఠాణా పరిధిలో మహిళ ఫిర్యాదు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. స్పీకరే ఈ సభకు సంరక్షకుడు.. ఆయన్ను రమ్మనండి..!

లోక్‌సభ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష ఎంపీల తీరుపై అసంతృప్తితో ఉన్న స్పీకర్ ఓం బిర్లా(Om Birla) సభకు హాజరుకావడం లేదు. ఆయన రాకపోవడంతో నిన్న, నేడు ఆ బాధ్యతలను ఇతర సీనియర్‌ ఎంపీలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా రాజేంద్ర అగర్వాల్ దిగువ సభను నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ ఓ అభ్యర్థన చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సీమా హైదర్‌కు సినిమా ఛాన్స్‌?

పబ్‌జీ (PUBG) గేమ్‌లో పరిచయమైన యువకుడి కోసం పాక్‌ నుంచి భారత్‌లోకి అక్రమ మార్గంలో అడుగుపెట్టిన సీమా హైదర్‌ (Seema Haider)సినిమా ఛాన్స్‌ కొట్టేసింది. ఉదయ్‌పుర్‌ టైలర్‌ కన్హయ్య లాల్‌ హత్య ఘటనపై ‘‘ఏ టైలర్‌ మర్డర్‌ స్టోరీ’’పేరిట ఓ చిత్రాన్ని జానీ ఫైర్‌ఫాక్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ త్వరలో తెరకెక్కించనుంది. ఈ సినిమాలో ‘రా’ ఏజెంట్‌ పాత్ర కోసం సీమాను సంప్రదించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘ఓవర్‌వెయిట్‌’లో భారత్‌.. మోర్గాన్‌ స్టాన్లీ రేటింగ్‌

ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థల రేటింగ్‌లలో ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ‘మోర్గాన్‌ స్టాన్లీ (Morgan Stanley)’ కీలక మార్పులు చేసింది. భారత్‌ (India) రేటింగ్‌ను మరింత మెరుగుపర్చి ‘ఓవర్‌వెయిట్‌ (Overweight)’గా పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ (Economy)లో సంస్కరణల అజెండా మూలధన వ్యయాలు, లాభాల విషయంలో సానుకూల దృక్పథంలో పయనిస్తోందని మోర్గాన్‌ స్టాన్లీ ఈ సందర్భంగా భారత్‌పై విశ్వాసం వ్యక్తం చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. శాంసంగ్‌ కోటి రుపాయల టీవీ.. ఫీచర్లివే..

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ సంస్థ శాంసంగ్‌ (Samsung) తాజాగా లగ్జరీ టీవీని భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఏకంగా 110 అంగుళాల 4కే డిస్‌ప్లేతో ఈ సరికొత్త టీవీని తీసుకొచ్చింది. M1 AI ప్రాసెసర్‌తో దీనిని తయారుచేసినట్లు కంపెనీ తెలిపింది. సఫైర్‌ గ్లాస్‌తో ఈ స్క్రీన్‌ను తయారు చేశారు. డాల్బీ అట్మాస్‌, మొబైల్ మిర్రరింగ్, వైఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయని శాంసంగ్ వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు