Hyderabad: భర్తతో గొడవ.. బ్యూటీపార్లర్‌పై భార్య ఫిర్యాదు

తన భర్తతో తలెత్తిన గొడవకు బ్యూటీపార్లరే కారణమంటూ ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated : 03 Aug 2023 11:38 IST

హైదరాబాద్‌: తన భర్తతో తలెత్తిన గొడవకు బ్యూటీపార్లరే కారణమంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని అబిడ్స్‌ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. పాతబస్తీకి చెందిన మహిళ.. మోడల్‌గా చూడాలనుకున్న తన భర్త కోరిక మేరకు బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. సదరు మహిళకు పార్లర్‌ సిబ్బంది హెయిర్‌ కట్‌ చేసి ఆయిల్‌ పెట్టారు. అనంతరం జుట్టు ఊడిపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో బ్యూటీపార్లర్‌పై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. పార్లర్‌లో పెట్టిన హెయిర్‌ ఆయిల్‌తోనే తన జుట్టు ఊడిపోయిందని ఫిర్యాదులో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు