TS Assembly: కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపాలని సాయన్న పరితపించారు: కేసీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొంతకాలం క్రితం మృతిచెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు శాసనసభ నివాళులర్పించింది.

Updated : 03 Aug 2023 13:05 IST

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొంతకాలం క్రితం మృతిచెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు శాసనసభ నివాళులర్పించింది. సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్‌ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాయన్న లేని లోటు పూడ్చలేనిదన్నారు. కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపాలని ఆయన పరితపించారని కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సాయన్న సేవలను కొనియాడారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది.

మరోవైపు శాసన మండలిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన ఆస్తినష్టం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మండలిలో సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఒకేసారి రైతు రుణమాఫీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు చెప్పారు. 

ఎన్నికలకు ముందు జరిగే చిట్టచివరి సమావేశాలుగా వీటిని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో అధికార భారాసతో పాటు విపక్షాలైన కాంగ్రెస్‌, భాజపాలు కూడా కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పరస్పర విమర్శలు, ఆరోపణలు ఇప్పటికే హోరెత్తుతున్నాయి. ఈసారి సభాపర్వంలో కూడా ఆ వేడి, వాడి కనిపించే అవకాశముంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు