Samsung: శాంసంగ్‌ కోటి రుపాయల టీవీ.. ఫీచర్లివే..

Samsung: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ శాంసంగ్‌ తాజాగా ఆర్ట్‌ డిస్‌ప్లే వాల్‌ ఫీచర్‌తో టీవీని లాంచ్‌ చేసింది.

Published : 03 Aug 2023 11:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ సంస్థ శాంసంగ్‌ (Samsung) తాజాగా లగ్జరీ టీవీని భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఏకంగా 110 అంగుళాల 4కే డిస్‌ప్లేతో ఈ సరికొత్త టీవీని తీసుకొచ్చింది. M1 AI ప్రాసెసర్‌తో దీనిని తయారుచేసినట్లు కంపెనీ తెలిపింది. సఫైర్‌ గ్లాస్‌తో ఈ స్క్రీన్‌ను తయారు చేశారు. డాల్బీ అట్మాస్‌, మొబైల్ మిర్రరింగ్, వైఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయని శాంసంగ్ వెల్లడించింది. అయితే, ఈ సరికొత్త టీవీ ఫీచర్లపై ఓ లుక్కేయండి.

110 అంగుళాల స్క్రీన్‌తో వస్తున్న ఈ శాంసంగ్‌ టీవీ ధర రూ.1,14,99,000గా కంపెనీ నిర్ణయించింది. అంటే దీని ధర కోటిపైనే. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 110 అంగుళాల మైక్రో ఎల్‌ఈడీ 4కే డిస్‌ప్లేను ఇచ్చారు. సఫైర్‌ గ్లాస్‌తో తయారు చేసిన 24.8 మిలియన్‌ మైక్రో ఎల్‌ఈడీలు ఇందులో అమర్చారు. దీంతో శక్తిమంతమైన రంగులను సైతం కంటికి ఇంపుగా మార్చగలదని కంపెనీ తెలిపింది. మైక్రో హెచ్‌డీఆర్‌, మల్టీ ఇంటెలిజెన్స్ AI అప్‌స్కేలింగ్, సీన్ అడాప్టివ్ కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ ఎక్స్‌పాన్షన్+ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

అదానీ చేతికి సంఘి సిమెంట్‌!

ఈ టీవీ మైక్రో ఎల్‌ఈడీ టీవీ మల్టీ వ్యూ ఫీచర్‌నూ అందిస్తుంది. ఈ ఫీచర్ సాయంతో నాలుగు వేర్వేరు సోర్సుల నుంచి కంటెంట్‌ను వీక్షించవచ్చని శాంసంగ్‌ తెలిపింది. మినిమలిస్టిక్ మోనోలిత్ డిజైన్‌తో ఈ టీవీ ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా అమర్చిన ఆర్ట్‌ మోడ్‌, యాంబియంట్‌ మోడ్‌+ సాయంతో టీవీని ఆర్ట్‌ డిస్‌ప్లే వాల్‌గా మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. మెరుగైన ఆడియో 100W RMS సౌండ్‌ సిస్టంను ఇందులో అమర్చారు. ఈ టీవీకి సోలార్‌ సెల్ రిమోట్‌ ఇచ్చారు. దీన్ని ఇండోర్‌ లైట్‌ సాయంతో ఛార్జ్‌ చేయొచ్చని కంపెనీ తెలిపింది. శాంసంగ్‌ వెబ్‌సైట్లతో పాటు ఇతర రిటైల్‌ స్టోర్లలో ఈ టీవీని కొనుగోలు చేయవచ్చని శాంసంగ్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని