Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Sep 2023 13:18 IST

1. త్వరలో పీవోకే భారత్‌లో కలుస్తుంది: వీకే సింగ్‌

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) భారత్‌లో తప్పకుండా కలుస్తుందంటూ.. కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్‌ (VK Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, అందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. సోమవారం రాజస్థాన్‌ (Rajasthan)లోని దౌసాలో జరిగిన పరివర్తన్‌ సంకల్ప్‌ యాత్ర కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఫుడ్‌ పాయిజన్‌.. 90 మంది విద్యార్థినులకు అస్వస్థత

నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌లోని కస్తూర్భా పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పుఢ్‌ పాయిజన్‌తో 90 విద్యార్థినులకు కడుపునొప్పితో పాటు వాంతులు అయ్యాయి. దీంతో సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పాఠశాల ఇన్‌ఛార్జ్‌ ప్రత్యేకాధికారి శోభ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అస్వస్థతకు గురైన విద్యార్థులందర్నీ నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నేనొస్తున్నా.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు: బాలకృష్ణ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించి తెదేపా అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని అరోపించారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారన్నారు. జగన్‌ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇలా అయితే యుద్ధ సమయంలో కష్టమే.. స్టార్‌లింక్‌ ఉదంతంపై అమెరికా ఆందోళన!

ఉక్రెయిన్‌ (Ukraine)లో గత ఏడాది స్టార్‌లింక్‌ (StarLink) సేవలను వినియోగించుకునేందుకు స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తిరస్కరించడం అమెరికా రక్షణ వర్గాలను సందేహంలో పడేశాయి. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులపై ఆధారపడితే యుద్ధం వంటి కీలక సమయాల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో ఈ ఉదంతం వెలుగులోకి తెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రష్యాలోకి ప్రవేశించిన కిమ్‌.. ఆయన రైలు చాలా ప్రత్యేకం..!

 ఉత్తరకొరియా (North Korea) నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) భారీ సాయుధ రైల్లో దాదాపు 20 గంటలకు పైగా ప్రయాణించి రష్యాలోకి ప్రవేశించారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం ప్యాంగ్యాంగ్‌ నుంచి బయల్దేరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యా వర్గాలు ధ్రువీకరించాయి. ఆయన నేడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ కానున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నేడే యాపిల్‌ ఈవెంట్‌.. ఐఫోన్‌ 15 సిరీస్‌తో పాటు ఏమేం రాబోతున్నాయ్‌..?

ప్రముఖ టెక్నాలజీ కంపెనీ యాపిల్‌ (Apple) అతిపెద్ద ఈవెంట్‌కు సిద్ధమైంది. నేడు (సెప్టెంబర్‌ 12న) ‘వండర్‌లస్ట్‌’ పేరిట అమెరికాలో ఈవెంట్‌ నిర్వహించనుంది. ఐఫోన్‌ 15 సిరీస్‌ (Apple iphone 15) స్మార్ట్‌ఫోన్లతో పాటు యాపిల్‌ వాచ్‌, వాచ్ అల్ట్రా మోడల్స్‌ సైతం ఈ ఈవెంట్లో లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే ఈవెంట్‌లో ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ గురించి కూడా యాపిల్‌ ప్రకటన చేసే అవకాశం ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చంద్రబాబు అరెస్టు అక్రమం.. హైకోర్టులో దమ్మాలపాటి లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

స్కిల్‌డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన తీరు అక్రమమని మాజీ అడ్వకేట్‌ జనరల్‌,  సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో లంచ్ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘‘గవర్నర్‌ అనుమతి తీసుకోకుండా ఎలా అరెస్టు చేస్తారు? అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌17 ఏ ప్రకారం అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారు? ఈ ప్రక్రియ అంతా సరికాదు. సీఐడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కెనడా ప్రధాని ట్రూడోకు వరుస షాక్‌లు..!

మన టైమ్‌ బాగోలేకపోతే ఎక్కడ ఎక్కువ సేపు ఉండకూడదనుకుంటామో.. అక్కడే రోజుల తరబడి గడపాల్సి వస్తుంది. ప్రస్తుతం కెనడా (canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau ) పరిస్థితి ఇదే. జీ20 ఘనంగా ముగిసింది.. అతిథులు అందరూ వెళ్లిపోయారు.. ఒక్క ట్రూడో తప్ప. ఆయన అధికారిక విమానంలో తీవ్రమైన సాంకేతిక సమస్య తలెత్తింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రియల్‌మీ సేల్‌ ప్రారంభం.. 5జీ స్మార్ట్‌ఫోన్లపై రాయితీలు

రియల్‌మీ 5జీ సేల్‌ (Realme 5G Sale) ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 17 వరకు ఇది కొనసాగనుంది. వివిధ 5జీ స్మార్ట్‌ఫోన్ల (Realme 5G smartphones)పై రాయితీలు, ఆఫర్లు ఉన్నాయి. ఇటీవల లాంచ్‌ చేసిన నార్జో 60x, రియల్‌మీ 11 5జీ, రియల్‌మీ 11 ప్రో 5జీ సహా పలు ఫోన్లపై ఆఫర్లు లభించనున్నాయి. ఈ సేల్‌లో 5జీ ఫోన్‌ కొనుగోలు చేసిన వారు గరిష్ఠంగా రూ.12,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. లిబియాలో జలప్రళయం.. బద్దలైన డ్యామ్‌లు..!

ఆఫ్రికా దేశమైన లిబియా(Libya)లో డేనియల్‌ తుపాన్‌ జల ప్రళయం సృష్టించింది. ఇక్కడ కురిసిన వర్షాల కారణంగా ముంచుకొచ్చిన వరదల తీవ్రతకు రెండు డ్యామ్‌లు బద్దలైపోయాయి. దీంతో దిగువ ప్రాంతాలకు వరద పోటెత్తి.. సమీపంలోని సముద్రంలోకి ప్రజలను లాక్కెళ్లింది. ఈ వరద కారణంగా నివాస ప్రాంతాలు ఊడ్చిపెట్టుకుపోయాయి. ఎక్కడ చూసిన వాహనాలు చెల్లచెదురుగా పడి ఉన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని