Apple event 2023: నేడే యాపిల్‌ ఈవెంట్‌.. ఐఫోన్‌ 15 సిరీస్‌తో పాటు ఏమేం రాబోతున్నాయ్‌..?

Apple iphone 15: యాపిల్‌ వండర్‌లస్ట్‌ పేరిట ఈవెంట్‌ నిర్వహించనుంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు యాపిల్‌ వాచ్‌లు, ఓఎస్‌ అప్‌డేట్స్‌కు సంబంధించిన ప్రకటనలు ఈ వేదికగా వెలువడే అవకాశం ఉంది.

Published : 12 Sep 2023 10:21 IST

Apple event 2023 | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ యాపిల్‌ (Apple) అతిపెద్ద ఈవెంట్‌కు సిద్ధమైంది. నేడు (సెప్టెంబర్‌ 12న) ‘వండర్‌లస్ట్‌’ పేరిట అమెరికాలో ఈవెంట్‌ నిర్వహించనుంది. ఐఫోన్‌ 15 సిరీస్‌ (Apple iphone 15) స్మార్ట్‌ఫోన్లతో పాటు యాపిల్‌ వాచ్‌, వాచ్ అల్ట్రా మోడల్స్‌ సైతం ఈ ఈవెంట్లో లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే ఈవెంట్‌లో ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ గురించి కూడా యాపిల్‌ ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఏమేం లాంచ్‌ చేస్తారు?

వండర్‌లస్ట్‌ ఈవెంట్‌లో ఐఫోన్‌ 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను యాపిల్‌ లాంచ్‌ చేయనుంది. ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను ఈ వేదికగా యాపిల్‌ విడుదల చేయనుంది. ఈ సారి ఎప్పుడూ ఇచ్చే లైటనింగ్‌ పోర్ట్‌ బదులు.. ఈయూ కామన్‌ ఛార్జర్‌ నిబంధనలకు అనుగుణంగా యూఎస్‌బీ టైప్‌-సి పోర్టుతో ఈ ఫోన్లు రానున్నట్లు తెలుస్తోంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

జీమెయిల్‌ స్టోరేజీ ఫుల్‌ అని చూపిస్తోందా? ఇలా క్లీనప్‌ చేసుకోండి..

వీటితో పాటు యాపిల్‌ ఐఓఎస్‌ 17, ఐప్యాడ్‌ఓఎస్‌ 17, మ్యాక్‌ ఓఎస్ 14, టీవీఓఎస్‌ 17, వాచ్‌ ఓఎస్‌ 10, మ్యాక్‌ ఓఎస్‌ సోనోమా వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సంబంధించి అప్‌డేట్స్‌ గురించి కూడా ఈవెంట్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ అల్ట్రా 9 కూడా ఇదే ఈవెంట్‌లో లాంచ్‌ చేసే అవకాశం ఉంది. ఎయిర్‌ పాడ్స్‌ ప్రోను యూఎస్‌బీ టైప్‌-సి పోర్టుతో తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఎక్కడ చూడొచ్చు? (Apple event live)

యాపిల్‌ ఈవెంట్‌ సెప్టెంబర్‌ 12న కాలిఫోర్నియాలోని యాపిల్‌ పార్క్‌లో నిర్వహించనున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ఈవెంట్‌ జరగనుంది. అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. యాపిల్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈవెంట్‌ ప్రత్యక్ష ప్రసారం కానుంది. యాపిల్‌.కామ్‌ వెబ్‌సైట్‌, యాపిల్‌ టీవీ+, యాపిల్‌ డెవలపర్‌ యాప్స్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని