Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Nov 2023 13:13 IST

1. ముందే చెప్పా.. ఆ 41 మంది బయటకు వస్తారని..!: ఆర్నాల్డ్‌ డిక్స్‌

ఉత్తరాఖండ్‌ సొరంగంలోనే(Uttarakhand Tunnel) చిక్కుకుపోయిన 41 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అద్భుతమని అంతర్జాతీయ సొరంగ నిపుణుడు ఆర్నాల్డ్‌ డిక్స్‌(Arnold Dix) హర్షం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ తర్వాత బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘41 మంది సురక్షితంగా బయటపడతారని నేను చెప్పాను గుర్తుందా..? ఈ క్రిస్మస్‌ నాటికల్లా ఎవరికీ ఏమీ కాదన్నాను. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హైదరాబాద్‌ సహా జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభం

తెలంగాణ వ్యాప్తంగా గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. డీఆర్‌సీ కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది చేరుకుంటున్నారు. ఈవీఎంలు, ఇతర సామగ్రిని అధికారులు వారికి అందజేస్తున్నారు. పోలింగ్‌ సిబ్బంది బుధవారం సాయంత్రం లోపు కేంద్రాలకు చేరుకోనున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై విచారణకు ఈసీ ఆదేశం

తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజున భారాస అభ్యర్థి కౌశిక్‌రెడ్డి(Koushik reddy) చేసిన భావోద్వేగ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) స్పందించింది. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్‌ ఎన్నికల అధికారులను ఆదేశించింది. మంగళవారం జరిగిన ప్రచారంలో (Telangana Assembly Elections) కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర.. ఓడితే శవయాత్ర..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 222 పరుగుల టార్గెట్‌ను కాపాడేందుకు మా ప్లాన్‌ అదే.. కానీ విఫలమైంది: సూర్యకుమార్‌

మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే ఆసీస్‌పై టీ20 సిరీస్‌(IND vs AUS)ను నెగ్గేద్దామని భావించిన టీమ్‌ఇండియా ఆశలకు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ రూపంలో బ్రేకులు పడ్డాయి. భారత్‌ నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యఛేదనలో అద్భుత శతకంతో మ్యాక్సీ ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చాడు. మ్యాక్స్‌వెల్ దూకుడుగా ఆడటంతో తమ ప్రణాళికలన్నీ వృథాగా మారిపోయానని టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్‌ తెలిపాడు. మ్యాక్స్‌వెల్ కేవలం 47 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం

కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ముకు భద్రత, ప్రతిఫలం కోరుకోవడం సహజం. అదే సమయంలో కుటుంబానికి పెద్ద దిక్కైన వ్యక్తికి జరగరానిది ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసానివ్వడం కోసం బీమా కూడా అవసరం. ఈ రెండూ కలయికలో ఇప్పటికే ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) పలు పాలసీలను తీసుకొచ్చింది. అయినా అధిక ప్రతిఫలం కోసం తమ సొమ్మును మదుపరులు ఇతరత్రా పెట్టుబడి సాధనాల్లో మదుపు చేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌పై ఎన్నికల స్క్వాడ్‌ అభ్యంతరం

తెలంగాణ భవన్‌లో భారాస చేపట్టిన దీక్షా దివస్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్క్వాడ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. గడువు ముగిసినందున పార్టీ కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించొద్దని అధికారులు సూచించారు. అయితే దీక్షా దివస్‌ ఎన్నికల కార్యక్రమం కాదని భారాస నేతలు చెప్పారు. తెలంగాణ భవన్‌ బయట, ఆవరణలో కార్యక్రమాలు చేయొద్దని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఐఆర్‌ఆర్‌ కేసు.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా

రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఐఆర్‌ఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను డిసెంబర్‌ 1కి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కలకలం.. భారత్‌లో 6 రాష్ట్రాలు అలర్ట్‌..!

చైనా (China)లో గత కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు (Respiratory Infections).. ప్రపంచ దేశాలను మళ్లీ కలవరపాటుకు గురిచేస్తున్నాయి. భారత (India) ప్రభుత్వం ఇటీవల దీనిపై స్పందిస్తూ.. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు అలర్ట్‌ అయ్యాయి. రాజస్థాన్‌, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, హరియాణా, తమిళనాడు రాష్ట్రాలు తమ ఆరోగ్య వ్యవస్థలను అప్రమత్తం చేశాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విశాఖలో గ్యాస్‌ లీక్‌ ఘటన.. చికిత్స పొందుతూ మరో ముగ్గురి మృతి

విశాఖ నగరం మధురవాడ వాంబే కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ మృతి చెందారు. వై.బాలరాజు(60), అతడి భార్య చిన్ని(55), పెద్దకుమారుడు గిరి(22) బుధవారం తెల్లవారుజామున చనిపోగా.. చిన్నకుమారుడు కార్తిక్‌ (21) రెండు రోజుల క్రితమే మృతి చెందాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సినిమా వాయిదా.. గౌతమ్‌ మేనన్ ఎమోషనల్‌ పోస్ట్

విక్రమ్‌ (Vikram) హీరోగా గౌతమ్‌ మేనన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram). స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. నవంబర్‌ 24న విడుదల కావాల్సిన ఈ చిత్రం తాజాగా మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని