Top Ten News @ 1PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 02 Apr 2024 12:59 IST

1. వెంటనే పింఛన్లు ఇవ్వాలి.. సీఎస్‌కు చంద్రబాబు ఫోన్‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌ చేశారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పింఛన్ల పంపిణీకి ఈసీ ఎలాంటి ఆంక్షలూ విధించలేదని.. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే అందించాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కాంగ్రెస్‌ నేతలకు లీగల్‌ నోటీసులు ఇస్తా: కేటీఆర్‌

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిస్తానని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రస్తావించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏసీ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి..!

ఏటా ఎండకాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు గరిష్ఠాలకు చేరుతున్నాయి. దీంతో ఒకప్పుడు విలాస వస్తువుగా ఉన్న ఎయిర్‌ కండిషనర్లు (Air Conditioner - AC) ఇప్పుడు దాదాపు అవసరంగా మారిపోయాయి. అయితే, సరైన ఏసీ కొనుగోలు చేయలేకపోతే అధిక విద్యుత్తు బిల్లు, గదిని చల్లబర్చడంలో ఇబ్బందుల వంటి సమస్యలు ఎదురవుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చర్యలకు సిద్ధంగా ఉండండి.. కోర్టుకు మళ్లీ రండి

తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు విచారణలో భాగంగా యోగా గురువు రామ్‌దేవ్ బాబా (Yoga guru Ramdev), పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలక్రిష్ణ మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కోర్టు.. చర్యలకు సిద్ధంగా ఉండాలని వారిని హెచ్చరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నేను ఇంకా బాగా ఆడాల్సింది: ముంబయి ఓటమిపై హార్దిక్‌

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ముంబయి రాత ఇంకా మారలేదు. సోమవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి ఘోర పరాభవాన్ని చవిచూసిన ఆ జట్టు.. హ్యాట్రిక్‌ ఓటమిని ఖాతాలో వేసుకుంది. మ్యాచ్‌ అనంతరం దీనిపై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) మాట్లాడుతూ.. తమ జట్టు మరింత క్రమశిక్షణతో, ధైర్యంగా ఆడాల్సిందని అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. త్వరలో మేం నలుగురం జైలుకు.. ఆతిశీ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆప్‌ (AAP) నేతలు అరెస్టవుతారని దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. వారిలో తాను కూడా ఉంటానని పేర్కొన్న ఆమె.. మిగతా ముగ్గురు సౌరభ్‌ భరద్వాజ్‌, దుర్గేశ్‌ పాథక్‌, రాఘవ్‌ చద్దా అని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వైరలవుతోన్న మహేశ్‌ స్టైలిష్‌ లుక్‌.. ట్రెండింగ్‌లోకి SSMB 29

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల్లో స్టార్‌ హీరో మహేశ్‌ బాబు (Maheshbabu) ఒకరు. తాజాగా ఆయన షేర్‌ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవలే ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం తదుపరి సినిమా షూట్‌ కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టైలిష్‌ లుక్‌లో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. విస్తారా విమానాల రద్దు.. వివరణ కోరిన కేంద్రం

ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా (Vistara) ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ కార్యకలాపాలను తగ్గించుకోవడంపై కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. వారం రోజుల్లో దాదాపు 100కు పైగా సర్వీసులను రద్దు చేయడం వెనకగల కారణాలను వెల్లడించాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రూ.41,000 కోట్ల దావా పరిష్కారానికి సిద్ధమైన గూగుల్‌

లక్షలాది మంది యూజర్ల సెర్చ్‌ డేటాను డిలీట్‌ చేసేందుకు ప్రముఖ టెక్‌ సంస్థ గూగుల్‌ (Google) అంగీకరించింది. తద్వారా ఐదు బిలియన్‌ డాలర్ల విలువైన దావాను పరిష్కరించుకునేందుకు సిద్ధమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నేను అవకాశవాదిని కాదు.. అవకాశాలే నా వద్దకు వచ్చాయి 

కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని