Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 29 Nov 2023 16:58 IST

1. చంద్రబాబు, పవన్‌ కలవకూడదని జగన్‌ విశ్వప్రయత్నాలు: నారా లోకేశ్‌

రానున్న ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఏ పోలింగ్‌ బూత్‌లో మీ ఓటు? ఇలా తెలుసుకోండి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా పార్టీలు ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేశాయి. అడ్రస్‌ మారడం వల్లో, ఇతర కారణాల వల్లో కొందరికి పోలింగ్‌ స్లిప్పులు అందకపోయి ఉండొచ్చు. అంతమాత్రాన ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మొబైల్‌ మీ చేతిలో ఉంటే సులువుగా మీ పోలింగ్‌ స్టేషన్‌ వివరాలను తెలుసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. సొరంగం ఆపరేషన్‌ను లైవ్‌లో చూసి.. మోదీ భావోద్వేగం

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో గల సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు.. 17 రోజుల తర్వాత బాహ్య ప్రపంచాన్ని చూశారు. మంగళవారం రాత్రి కూలీలను ఒక్కొక్కరిగా సొరంగంలో నుంచి బయటకు తీసుకొచ్చారు. అదే సమయంలో దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేబినెట్‌ మంత్రులంతా ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను లైవ్‌ స్ట్రీమింగ్‌లో చూశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఓటు వేసేందుకు స్వగ్రామాలకు పయనమైన జనం.. బస్‌ స్టేషన్లలో రద్దీ

ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఉంటూ స్వగ్రామంలో ఓటు ఉన్న వారు సొంతూళ్లకు వెళ్లేందుకు పయనమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌(ఎంజీబీఎస్‌), సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌, ఉప్పల్‌ కూడలి, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ జంక్షన్‌ ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. డ్వాక్రా మహిళలకు డ్రోన్లు.. మరో ఐదేళ్లు ఉచిత రేషన్‌: కేబినెట్ కీలక నిర్ణయాలు

గ్రామీణ ప్రాంతాల్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ప్రయోజాలను విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 15 వేల మహిళా ‘స్వయం సహాయక బృందాల’కు డ్రోన్లను అందించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. O2.. మనకి ఆక్సిజన్‌!

జీవ మనుగడకు ఓ2 (ఆక్సిజన్‌) ఎంత కీలకమో.. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు విలువా అంతే ముఖ్యమైనది. సమస్త జీవజాలానికి శ్వాస ఎంత అవసరమో, దేశ, రాష్ట్ర భవిష్యత్‌ నిర్మాణానికీ ఓటు అంతే కీలకం. ఇది అందరూ వినియోగించుకునే అద్భుతమైన హక్కు. ప్రభుత్వాలు మారిపోతాయేమోగానీ.. ఓటు అనేది నిశ్శబ్ద ఆయుధం. దాన్ని సక్రమంగా వినియోగించుకోవడం మనందరి బాధ్యత. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. సొరంగంలోని బిడ్డకోసం 16 రోజులు నిరీక్షించి.. బయటకొచ్చే కొద్ది గంటల ముందే..!

ఉత్తరాఖండ్‌ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 41 మంది కూలీలు మంగళవారం రాత్రి మృత్యుంజయులుగా తిరిగివచ్చారు. వారి రాకకోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన కుటుంబ సభ్యుల ఆరాటం ఫలించింది. 70 ఏళ్ల బాసెత్ ముర్ము కూడా తన 29 ఏళ్ల కుమారుడు భక్తు ముర్ము కోసం ఊపిరిబిగపట్టి వేచిచూశాడు. కానీ బిడ్డ బయటకు రావడానికి కొద్దిగంటల ముందే  తండ్రి తుదిశ్వాస విడిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఇదేం సిటీ.. విద్యావంతులు ఈసారైనా ఓటెత్తేనా?

తెలంగాణ అంటేనే జన చైతన్యానికి పెట్టింది పేరు.. అలాంటి రాష్ట్రంలో గుండెకాయ వంటి హైదరాబాద్‌ ప్రజలు మాత్రం పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. మహానగరంలో సమస్యలు ఉన్నప్పుడు సామాజిక మాధ్యమాల్లో  ప్రశ్నించేవారే.. ఎన్నికలప్పుడు నాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ట్రెండ్‌ గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఓటింగ్‌ కోసం ఇచ్చిన సెలవును వ్యక్తిగత పనుల కోసం.. విశ్రాంతి తీసుకోవడానికి వాడుకొంటున్నారన్న అపవాదు ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. వీడిన ఉత్కంఠ.. భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ కొనసాగింపు

ఎట్టకేలకు భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవిపై ఉత్కంఠ వీడింది. ప్రధాన కోచ్‌గా కొనసాగేందుకు రాహుల్ ద్రవిడ్ అంగీకరించాడు. దీంతో బీసీసీఐ అధికారిక ప్రకటన జారీ చేసింది. రాహుల్‌తోపాటు ఇప్పటికే ఉన్న సహాయక సిబ్బంది పదవీకాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది. అయితే, వీరు ఎప్పటి వరకు ఈ పదవిలో ఉంటారనేది మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. కౌన్‌బనేగా కరోడ్‌పతి సంచలనం.. రూ.కోటి గెలుచుకున్న 14ఏళ్ల బాలుడు.. ఆ ప్రశ్న ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్‌ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’  షోలో పాల్గొన్న 14ఏళ్ల బాలుడు సంచలనం సృష్టించాడు. ఏకంగా రూ.కోటి గెలుచుకుని రికార్డు సృష్టించాడు. కేబీసీ జూనియర్స్‌ స్పెషల్‌లో భాగంగా హరియాణాలోని మహేంద్రగఢ్‌కు చెందిన మయాంక్‌ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ.కోటిని సొంతం చేసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని