Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Jun 2024 17:03 IST

1. తెలంగాణలో 10వేల మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు: సీఈవో వికాస్‌రాజ్‌

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నాలుగు అంచెల భద్రత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్‌ కేంద్రంలో ఉండే ఏజెంట్లు, సిబ్బంది సెల్‌ఫోన్లు వినియోగించేందుకు అనుమతిలేదని స్పష్టం చేశారు. పూర్తి కథనం

2. బెయిల్‌పై కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. రేపు తిరిగి జైలుకు

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో బెయిల్ విషయంలో ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఊరట దక్కలేదు. ఆయన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై దిల్లీ కోర్టు జూన్‌ 5న నిర్ణయం తీసుకోనుంది. పూర్తి కథనం

3. 92 ఏళ్లలో తొలిసారి ఓటు.. వృద్ధుడి ఆనందం!

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది. కానీ, తనకు 92 ఏళ్లు వచ్చేవరకు అసలు పోలింగ్‌ కేంద్రం వైపు చూడని ఓ వ్యక్తి.. ఎట్టకేలకు జీవితంలో తొలిసారి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆయనే ఝార్ఖండ్‌ (Jharkhand)లోని సాహిబ్‌గంజ్‌కు చెందిన ఖలీల్‌ అన్సారీ. దృష్టి లోపంతో బాధపడుతున్న ఆయన.. రాజ్‌మహల్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధి మండ్రోలోని పదో నంబరు పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. పూర్తి కథనం

4. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్‌ స్టేషన్‌లో నేడు ఓటింగ్‌..

 ప్రజాస్వామ్య పండగగా అభివర్ణించే సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఎన్నికల్లో ప్రతీ ఒక్క ఓటరును భాగస్వామిని చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కృషి చేస్తోంది. అందుకోసం మారుమూల గ్రామాల నుంచి అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో కూడా పోలింగ్‌ కేంద్రాలను అందుబాటులో ఉంచుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎతైన పోలింగ్‌ స్టేషన్‌ (Worlds Highest Polling Station)లోనూ నేడు ఓటింగ్‌ జరుగుతుంది. పూర్తి కథనం

5. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

చెన్నై (Chennai) నుంచి ముంబయి(Mumbai) బయల్దేరిన ఇండిగో విమానాని(IndiGo flight)కి బాంబు బెదిరింపు(bomb threat) కలకలం సృష్టించింది. దీంతో వెంటనే విమానాన్ని ముంబయిలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. వారం రోజుల వ్యవధిలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి. పూర్తి కథనం

6. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించిన యూనియన్‌ బ్యాంక్‌.. లేటెస్ట్‌ రేట్లు ఇవే..

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (UBI) ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (FD) అందించే వడ్డీ రేట్లను సవరించింది. రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ చేసే ఎఫ్‌డీపై పెంచిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. పూర్తి కథనం

7. గత ప్రభుత్వం కాంగ్రెస్‌ నేతలను ఆహ్వానించలేదు: పొన్నం ప్రభాకర్‌

తెలంగాణ కోసం ఎన్నో వర్గాల ప్రజలు పోరాటం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ వచ్చాక పదేళ్లు నియంతృత్వం కొనసాగిందని విమర్శించారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు.   పూర్తి కథనం

8. గంభీర్‌ మంచి ఛాయిసే.. స్టార్లను డీల్‌ చేయగలడు: గంగూలీ

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) ఎంపిక లాంఛనప్రాయమేనని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం జూన్ చివరితో ముగుస్తుంది. గంభీర్‌ను ప్రకటించడం ఖాయమనే వార్తలూ వస్తున్నాయి. మరోవైపు బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందనా లేదు.పూర్తి కథనం

9. సీఎంఆర్‌ అల్యూమినియం పరిశ్రమలో 50 మంది కార్మికులకు అస్వస్థత

ఏర్పేడు మండలం రాజులపాలెంలోని సీఎంఆర్‌ అల్యూమినియం పరిశ్రమలో 50 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అల్యూమినియం తుక్కు కరిగించే  క్రమంలో చిన్నపాటి గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీ కావడంతో దాదాపు 50 మంది కార్మికులు ఉన్నట్టుండి వాంతులు చేసుకొని సొమ్మసిల్లి పడిపోయారు. పూర్తి కథనం

10. ముగిసిన సుదీర్ఘ ధ్యానం.. తిరువళ్లువర్‌కు మోదీ నివాళులు

తమిళనాడు (Tamil Nadu)లోని కన్యాకుమారిలో స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేపట్టిన సుదీర్ఘ ధ్యానం ముగిసింది. గురువారం సాయంత్రం ప్రారంభమైన ధ్యానం.. 45 గంటలపాటు కొనసాగింది. ఈ క్రమంలోనే ఉదయం సూర్యుడికి అర్ఘ్యం వదిలారు. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని