Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Jun 2024 17:03 IST

1. 11న టీడీఎల్పీ సమావేశం.. 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం: బుచ్చయ్యచౌదరి

ఈనెల 11న టీడీఎల్పీ నేతగా చంద్రబాబుని ఎన్నుకుని గవర్నర్‌కు నివేదిక పంపుతామని తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం 12న ఉంటుందని వెల్లడించారు. పూర్తి కథనం

2. దేశంతోపాటు తెలంగాణలోనూ మోదీ గాలి వీచింది: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో దేశంతోపాటు తెలంగాణలోనూ మోదీ గాలి వీచిందని చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘పోలీసులు బాగా పనిచేయడం వల్లే లోక్‌సభ ఎన్నికలు నిజాయతీగా జరిగాయి. మద్యం, డబ్బుల ప్రభావం ఈ ఎన్నికల్లో పని చేయలేదు. పూర్తి కథనం

3. చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి ఫోన్‌.. ప్రత్యేకంగా అభినందనలు

ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెదేపా అధినేత చంద్రబాబుకు గురువారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. పూర్తి కథనం

4. హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. 3 రోజులపాటు వానలే: వాతావరణశాఖ

నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, ఈఎస్‌ఐ, యూసఫ్‌గూడ, బోరబండ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, కోఠి, అబిడ్స్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, ఫిలింనగర్‌, కవాడిగూడ తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. పూర్తి కథనం

5. ఏపీ ఫైబర్ నెట్‌ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల భద్రత

విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్‌ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కీలక దస్త్రాలను కొందరు ధ్వంసం చేస్తారని నిఘా వర్గాల సమాచారం రావడంతో భద్రతను పెంచారు. ముఖ్యమైన దస్త్రాలు, డేటా ఎవరూ బయటకు తీసుకెళ్లకుండా కాపలా కాస్తున్నారు.   పూర్తి కథనం

6. అప్పటివరకూ ‘మా’ నుంచి హేమ సస్పెండ్‌..: మంచు విష్ణు

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన సినీ నటి హేమను (Actress Hema) మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) సస్పెండ్‌ చేసింది. పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) తెలిపారు.  పూర్తి కథనం

7. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ వేదిక మారుస్తారా? ఐసీసీ ఏం చెప్పిందంటే..?

టీ20 ప్రపంచకప్‌ 2024 టోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికాలో న్యూయార్క్‌ మైదానంలోని పిచ్‌ (New York Pitch)పై తీవ్ర చర్చ జరుగుతోంది. బౌలర్లకు అనుకూలంగా ఉన్న ఈ డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ అనూహ్యంగా బౌన్స్‌ అవుతూ బ్యాటర్లను ఇబ్బందికి గురిచేస్తోంది. మొన్న ఇదే పిచ్‌పై శ్రీలంక 77 పరుగులకు కుప్పకూలగా.. నిన్న ఐర్లాండ్‌ను భారత్‌ 96 ఓవర్లకు ఆలౌట్‌ చేసింది.  పూర్తి కథనం

8. విరాట్‌ కోహ్లీ ఔట్.. కావాలి కుర్రాళ్లకు పాఠం

టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ మంచి బోణీ కొట్టిందిలే అనుకుంటే పొరపాటు. ఇప్పుడే అసలు కథ మొదలైంది. బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో సత్తా చాటేశామని సంబరపడిపోకూడదు. పిచ్‌ను అర్థం చేసుకోవడంలో సీనియర్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇబ్బందిపడినట్లు అనిపించింది. అయితే, ఆరంభంలోనే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ ఎదురుకావడం ఒకెత్తు మంచిదేనంటున్నారు విశ్లేషకులు. పూర్తి కథనం

9. వివో కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌.. ధర రూ.లక్షన్నర పైనే!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో మరో కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌ను భారత్‌లో గురువారం విడుదల చేసింది. వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3 ప్రో (Vivo X Fold 3 Pro) పేరిట తీసుకొచ్చింది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌, ట్రిపుల్‌ కెమెరా సెటప్‌, 8.03 అంగుళాల అమోలెడ్‌ తెర వంటి ఫీచర్లు ఉన్నాయి. పూర్తి కథనం

10. ఎనిమిదోసారి.. లోక్‌సభలో ‘సీనియర్‌ మోస్ట్‌’ ఎంపీలు!

ప్రజాస్వామ్య దేవాలయంగా పిలిచే పార్లమెంటులో అడుగుపెట్టి.. లక్షల మంది తరఫున తమ గళాన్ని వినిపించే అవకాశం కొందరికే దక్కుతుంది. ఈ క్రమంలోనే తమ ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరగొంటూ.. దశాబ్దాల పాటు లోక్‌సభకు ఎన్నికవుతోన్న నాయకులు ఎందరో ఉన్నారు.  పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని