Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 16 Apr 2024 16:59 IST

1. ఈ ఎన్నికలు రాజ్యాంగ వ్యతిరేకులను శిక్షిస్తాయి: ప్రధాని మోదీ

రానున్న ఎన్నికలు రాజ్యాంగ వ్యతిరేకులను శిక్షిస్తాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బిహార్‌లోని గయలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. దేశాన్ని 'వికసిత భారత్'గా మార్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొందరు అడ్డుకుంటున్నారని విపక్ష కూటమిపై విరుచుకుపడ్డారు. అటువంటి వారిని శిక్షించేందుకే ఈ ఎన్నికలు  జరుగుతున్నాయని మంగళవారం అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ‘మోదీ.. సంపన్నులకు ఓ సాధనం’.. రాహుల్‌ విమర్శలు

దేశంలోని కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఓ సాధనంగా మారారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. వారి బ్యాంకు రుణాలు మాఫీ చేశారంటూ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోజికోడ్‌లోని కొడియత్తూర్‌లో కాంగ్రెస్‌ ఏర్పాటుచేసిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న వేళ ఈ వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ఎన్నికల వేళ.. ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు

సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో మరో ఉన్నతాధికారిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాసుదేవరెడ్డిని తక్షణం విధుల నుంచి తొలగించాలని, ఎన్నికల విధులు అప్పగించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రత్యామ్నాయంగా ముగ్గురు ఐఏఎస్‌ల పేర్లతో జాబితా ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాదు’: ప్రజలకు దిల్లీ సీఎం సందేశం

 దేశం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకు ఓ కొడుకులా, సోదరుడిలా పనిచేసిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిహాడ్‌ జైలు నుంచి ప్రజలకు సందేశం పంపారని ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్  పేర్కొన్నారు.  మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రసంగించిన సంజయ్‌సింగ్‌  ‘‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాదు’’ అని ముఖ్యమంత్రి పంపిన సందేశాన్ని వినిపించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. యూపీఎస్సీ సివిల్స్‌ తుది ఫలితాలు వచ్చేశాయ్‌.. తెలుగు అమ్మాయికి మూడో ర్యాంకు

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్‌ (Civils) - 2023 తుది ఫలితాలు విడుదలయ్యాయి.  ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకుతో మెరిశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. 18న భారాస కీలక సమావేశం.. ముఖ్య నేతలందరికీ ఆహ్వానం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌లో భారాస అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఆయన ‘బి ఫారాలు’ అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చుకింద ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు. పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. వాట్సప్‌లో మరో కొత్త ఆప్షన్‌.. ఆన్‌లైన్‌లో ఉన్న వారి లిస్ట్‌ ఒకేచోట!

 ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌కు సిద్ధమైంది. పిన్‌ చాట్‌, ఏఐ ఫీచర్లను తీసుకొచ్చిన యాప్‌.. ఇప్పుడు చాట్‌ లిస్ట్‌లో ప్రత్యేక ఆప్షన్‌ తీసుకురానుంది. ఆన్‌లైన్‌లో ఉండేవారి లిస్ట్‌ ఒకేచోట దర్శనమివ్వనుంది. దీంతో కమ్యూనికేషన్‌ అనుభవం మరింత మెరుగుకానుందని వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో పంచుకుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8.  ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్‌ సేల్‌.. ఏసీ, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లపై ఆఫర్లు

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్‌ సేల్‌ (Flipkart Summer Sale) ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్‌ 17న మొదలై 23 వరకు కొనసాగుతుంది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కూలర్లు, ఫ్యాన్ల వంటి కూలింగ్‌ హోమ్‌ అప్లయన్సెన్స్‌పై ఆఫర్లు ఉండనున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. భాజపాను గెలిపించేది కాంగ్రెసే: గులాం నబీ ఆజాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్‌(Congress)ను ఉద్దేశించి డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) అధినేత గులాం నబీ ఆజాద్‌ (Ghulam Nabi Azad) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు ఆ పార్టీని చూస్తే.. విచిత్రమైన భావన కలుగుతుందన్నారు. ‘‘భాజపాతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందేమోనని కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంటుంది. పార్టీలో సంస్థాగతమైన మార్పు కోసం గతంలో 23 మంది నేతలు పోరాడారు. కానీ, అగ్రనాయకత్వం వారి మాటలు వినిపించుకోలేదు’’ అని ఆజాద్ మీడియాతో వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. సల్మాన్‌ ఇంటిపై కాల్పులు: విదేశాల్లో కుట్ర.. ముంబయిలో అమలు

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఇంటిపై కాల్పుల ఘటనలో దర్యాప్తు వేగవంతమైంది. తాజాగా గుజరాత్‌లోని భుజ్‌ జిల్లాలో షూటర్లు వికాస్‌ గుప్తా (24), సాగర్‌ పాల్ (21)లను అరెస్టు చేశారు. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాతో సంబంధాలున్నట్లు నిందితులు అంగీకరించారు. తాజాగా న్యాయస్థానం ఈ ఇద్దరు నిందితులను 10 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని