Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 25 May 2024 16:59 IST

1. తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం

ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27న మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో  పోలింగ్‌ జరగనుంది. భారాస ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.  పూర్తి కథనం

2. కేటీఆర్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం: మల్లు రవి

భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివారని ప్రచారం చేస్తున్న నాయకులు ఆ కళాశాలలో చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుగుతారా? అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఆ కళాశాల వారే పట్టభద్రులు.. మిగిలిన వారు కాదన్నట్లుగా మాట్లాడటం సరి కాదు. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను కించపరుస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. పూర్తి కథనం

3. వాళ్లిద్దరూ ఎంతోమందికి స్ఫూర్తి: జాన్వీ కపూర్‌

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) తన తాజా సినిమా ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. పూర్తి కథనం

4. రైడర్స్‌ విజయాలకు సన్‌రైజర్స్‌ ‘ఫైనల్’ చెక్‌ వేసేనా?

తొలి క్వాలిఫయర్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకొనే మంచి అవకాశం హైదరాబాద్‌ ఎదుట నిలిచింది. ఇదే సీజన్‌లో కోల్‌కతా చేతిలో రెండుసార్లు ఎదురైన పరాభవాలకు ‘ఫైనల్‌’ విజయంతో చెక్ పెట్టేందుకు సన్‌రైజర్స్ సిద్ధమవుతోంది. ఆదివారం ‘చెపాక్‌’ వేదికగా కోల్‌కతా - హైదరాబాద్‌ జట్ల మధ్య ఐపీఎల్ 17వ ఎడిషన్‌ టైటిల్‌ పోరు జరగనుంది. పూర్తి కథనం

5. జియో సినిమా ప్రీమియం వార్షిక ప్లాన్‌.. ప్రారంభ ఆఫర్‌ కింద 50% తగ్గింపు

రిలయన్స్‌కు చెందిన స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమా (Jio Cinema) ప్రీమియం కొత్త వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం నెలవారీ ప్లాన్‌ తీసుకొచ్చిన ఈ సంస్థ.. తాజాగా అందుబాటు ధరలో దీన్ని ప్రవేశపెట్టింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌ కింద ఎలాంటి ప్రకటనలూ లేకుండా 4కె రిజల్యూషన్‌తో స్ట్రీమింగ్‌ వీడియోలను చూడొచ్చు. పూర్తి కథనం

6. ‘మాస్టారూ.. ముందు మీ దేశం సంగతి చూస్కోండి’.. పాక్ ఎంపీకి కేజ్రీవాల్‌ చురక

భారతదేశ సార్వత్రిక ఎన్నికలు, దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చిన పాకిస్థాన్‌ ఎంపీకి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind kejriwal) తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మా వ్యవహారాల్లో తల దూర్చకుండా.. మీ దేశం సంగతి మీరు చూసుకోండి’ అంటూ ఘాటుగా బదులిచ్చారు. మీ మద్దతు ఏం అక్కర్లేదంటూ హితవు పలికారు. పూర్తి కథనం

7. కార్లతో ఢీకొట్టి.. కర్రలతో కొట్టుకొని: అర్ధరాత్రి హైవేపై గ్రూప్‌ఫైట్‌

కర్ణాటకలో కొందరు యువకులు రాత్రివేళ రోడ్డుపై హల్‌చల్‌ చేశారు. కార్లతో పరస్పరం ఢీకొట్టుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. మే 18న ఉడుపి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన (Group Fight in Karnataka)కు సంబంధించిన దృశ్యాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video)గా మారాయి.  పూర్తి కథనం

8. గూగుల్‌ మ్యాప్స్‌ సహాయంతో డ్రైవింగ్‌.. నీటి ప్రవాహంలోకి కారు

తెలియని, కొత్త ప్రదేశాలకు వెళ్తున్న సమయంలో సాధారణంగా  ప్రజలు తమ గమ్య స్థానాలను చేరుకోవడానికి  గూగుల్‌ మ్యాప్స్‌ (Google maps)ను ఉపయోగిస్తారు. కాని ఒక్కోసారి తప్పు దారులను చూపించడంతో ప్రమాదాల బారిన పడ్డవారు చాలామందే ఉన్నారు. జీపీఎస్‌ కనెక్టివిటీ, సాంకేతిక లోపాల కారణంగా ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశముంటుంది. పూర్తి కథనం

9. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ సమ్మె.. 70శాతం విమానాలు రద్దు

ఫ్రాన్స్‌ (France) రాజధాని పారిస్‌లోని (Paris) అత్యంత రద్దీగా ఉండే ఓర్లీ విమానాశ్రయం ఒక్కసారిగా బోసిపోయింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ సామూహిక సమ్మెకు దిగడంతో దాదాపు 70 శాతానికి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈమేరకు ఫ్రాన్స్‌ పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. పూర్తి కథనం

10. మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!

వేసవిలో రాత్రి మిద్దెపైన లేదా ఆరుబయలు ప్రదేశంలో కూర్చొని ఆకాశం వైపు చూస్తే వేలాది నక్షత్రాలు (Stars) కనిపిస్తుంటాయి. ఈ తారలు మన పాలపుంతకు చాలా దూరంలో ఉంటాయి. వీటి వద్దకు చేరాలంటే ప్రస్తుతమున్న అత్యంత వేగవంతమైన రాకెట్ల సాయంతో వెళ్లినా వేల సంవత్సరాలు పడుతుంది.  పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు