Stars Disappearing: మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!

కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.

Published : 25 May 2024 16:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: వేసవిలో రాత్రి మిద్దెపైన లేదా ఆరుబయలు ప్రదేశంలో కూర్చొని ఆకాశం వైపు చూస్తే వేలాది నక్షత్రాలు (Stars) కనిపిస్తుంటాయి. ఈ తారలు మన పాలపుంతకు చాలా దూరంలో ఉంటాయి. వీటి వద్దకు చేరాలంటే ప్రస్తుతమున్న అత్యంత వేగవంతమైన రాకెట్ల సాయంతో వెళ్లినా వేల సంవత్సరాలు పడుతుంది. అయితే.. కొన్నేళ్లుగా ఈ నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురిచేస్తోంది.

ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు

ఈ అంశంపై పరిశోధనలు చేసిన కోపెన్‌హెగన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. కొన్ని నక్షత్రాలు భారీ పరిమాణం కలిగివుండటంతో కృష్ణబిలం (Black Hole) సమీపానికి వెళ్లే సమయంలో నేరుగా దానిలోకి వెళ్లిపోతున్నాయని తెలిపింది. సాధారణంగా ఒక నక్షత్రం తన జీవితం ముగిసిన సమయంలో పెద్ద కాంతిని, విస్ఫోటాన్ని వెలువరించి తన యాత్రను ముగిస్తుంది. అయితే ఇక్కడ మాత్రం కృష్ణబిలంలో కలుస్తుండటంతో ఎలాంటి సూపర్‌నోవా ఏర్పడటం లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సూపర్‌నోవా అంటే నక్షత్రం అంత్య సమయంలో సంభవించే శక్తిమంతమైన, ప్రకాశవంతమైన పేలుడు.

800 నక్షత్రాలు అదృశ్యం

గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు ఇలా కనిపించకుండా పోయినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఓ గంటకు ముందు కనిపించిన నక్షత్రం అనంతరం కనిపించకుండా పోయిన వైనాన్ని వారు తమ పరిశోధనల్లో ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని