Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...   

Published : 31 May 2024 16:59 IST

1. తెలంగాణలో రెండ్రోజులపాటు మోస్తరు వర్షాలు: వాతావరణ శాఖ

నైరుతి రుతుపవనాలు శుక్రవారం కేరళలోని మిగిలిన మరి కొన్ని ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశించనున్నాయి. శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తి కథనం

2. రూ.3లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్‌ఐ

నగరంలోని కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. భూ వివాదం కేసులో రూ.3లక్షలు లంచం తీసుకుంటుండగా..  ఇన్‌స్పెక్టర్‌ వీరస్వామి, ఎస్‌ఐ షఫీ, మధ్యవర్తి ఉపేందర్‌లను అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి కథనం

3. తొలి మ్యాచ్‌ నాటికి.. మేం చేయాల్సిందదే: రోహిత్

అన్ని అస్త్రాలతో టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) బరిలోకి దిగిన టీమ్‌ఇండియా.. వాటిని పరీక్షించుకొనేందుకు శనివారం బంగ్లాతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. అసలైన సంగ్రామంలో మాత్రం జూన్‌ 5న ఐర్లాండ్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ క్రమంలో తమ సన్నద్ధతపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీతో సంభాషించాడు. పూర్తి కథనం

4. ఆ ఫైనలిస్టుల్లో ఒక్కరూ లేరు.. అయినా అది భారత్‌కే వరం: వసీమ్‌ అక్రమ్

ఐపీఎల్ 2024 సీజన్‌ ఫైనల్‌లో తలపడిన రెండు జట్ల నుంచి.. ఏ ఒక్క ఆటగాడూ వరల్డ్‌ కప్‌ కోసం భారత్‌కు ఎంపిక కాకపోవడంపై సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వచ్చాయి. ఛాంపియన్‌ కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన రింకు సింగ్‌ మాత్రమే ‘ట్రావెల్ రిజర్వ్’గా ఉన్నాడు. ఇక రన్నరప్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నుంచి ఎవరికీ అవకాశం రాలేదు. పూర్తి కథనం

5. ఇకపై గూగుల్‌ మెసేజ్‌లనూ ఎడిట్‌ చేయొచ్చు

ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా గూగుల్ (Google) తన యాప్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు వాట్సప్‌(WhatsApp), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram).. వంటి యాప్‌లకే పరిమితమైన ‘‘ఎడిట్‌’’ ఆప్షన్‌ను తన యాప్‌నకు జోడించింది.  పూర్తి కథనం

6. గంటలతరబడి విమానం ఆలస్యం.. ఎయిరిండియాకు డీజీసీఏ నోటీసులు

కొన్ని గంటల పాటు ఎయిరిండియా (Air India) విమానం ఆలస్యం కావడంతో కనీస సదుపాయాలు కూడా అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)(DGCA) స్పందించింది. పూర్తి కథనం

7. కేరళలో అలాంటివేం జరగవ్‌.. డీకేఎస్‌ ‘శత్రు భైరవి యాగం’ వ్యాఖ్యలపై కేరళ మంత్రి!

తమ ప్రభుత్వంపైన, సీఎం సహా తనపైనా కొందరు తాంత్రిక పూజలు చేస్తున్నారంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీటిని కేరళ మంత్రి  డా. ఆర్‌.బిందు తోసిపుచ్చారు. తమ రాష్ట్రంలో అలాంటి కార్యకలాపాలేమీ జరగవన్నారు.   పూర్తి కథనం

8. మహిళా పోలీసుల చేతిలో ప్రజ్వల్‌ అరెస్టు.. ఎందుకంటే!

అనేకమంది మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను సిట్‌ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయనను అదుపులోకి తీసుకునేందుకు మహిళా పోలీసు బృందమే ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. ఇద్దరు మహిళా ఐపీఎస్‌ అధికారిణులు దీనికి నేతృత్వం వహించారు. పూర్తి కథనం

9. ఇజ్రాయెల్‌ మొండి పట్టు.. సాధారణ పౌరులే సమిధలు!

అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, అగ్రరాజ్యం అమెరికా (USA) మొత్తుకుంటున్నా ఇజ్రాయెల్‌ (Israel) మాత్రం వెనకడుగు వేయడం లేదు. హమాస్‌ (Hmas) నిర్మూలనే ధ్యేయంగా మొండిగా ముందుకెళ్తోంది. దాడులను తక్షణమే ఆపాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను పెడచెవిన పెట్టి.. రఫా నగరంపై (Rafah) లాంఛర్లు, బాంబులతో విరుచుకుపడుతోంది. పూర్తి కథనం

10. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా వేయాలి: ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా వేయాలని భారాస నేత ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. జూన్‌ 9న పరీక్ష నిర్వహించొద్దని.. అదే రోజున ఇంటెలిజెన్స్‌ బ్యూరో పరీక్ష కూడా ఉందని తెలిపారు. చాలా మంది నిరుద్యోగులు ఐబీ పరీక్ష రాస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని