Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 19 Apr 2023 21:10 IST

1. కాంగ్రెస్‌కి భారాస బీ టీమ్‌.. ఆ రెండు పార్టీలు కలుస్తాయి: తరుణ్‌చుగ్‌ 

కేసీఆర్‌ సర్కారును మార్చాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘కేసీఆర్‌ తెలంగాణ నయా నిజాం.. ఆయనకు అహంకారం ఎక్కువ. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఏమీ పట్టవు. ఆయన కుటుంబం వీటన్నింటికీ అతీతం అని అనుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గుడ్‌న్యూస్‌! మేడ్చల్‌కు 20 ఎంఎంటీఎస్‌ రైళ్లు.. టైమింగ్స్‌ ఇవే!

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగర వాసులకు గుడ్‌న్యూస్‌. జీహెచ్‌ఎంసీ పరిధిలో దక్షిణ మధ్య రైల్వే అదనంగా 40 ఎంఎంటీఎస్‌ సర్వీసులను పెంచింది. రైళ్ల పెంపుతో పాటు వాటి గమ్య స్థానాలను సైతం పొడిగించింది. సికింద్రాబాద్‌-మేడ్చల్‌ మధ్య కొత్తగా 20 MMTS సర్వీసులు పరుగులు పెట్టనుండగా..  ఫలక్‌నుమా -ఉందానగర్‌ మధ్య మరో 20 రైళ్ల గమ్యస్థానాలను పొడిగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని 8గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటలపాటు ఆయన్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రేపు ఉదయం 10:30 గంటలకు మళ్లీ రావాలని సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్‌రెడ్డి ఈనెల 25 వరకు ప్రతిరోజు సీబీఐ  విచారణకు హాజరుకానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మ్యాచ్‌ ఫిక్సింగ్ కలకలం.. సమాచారం ఇమ్మంటూ సిరాజ్‌కు మెసేజ్‌లు!

భారత క్రికెట్‌లో మరోసారి మ్యాచ్‌ ఫిక్సింగ్ కలకలం ఉదంతం తెరపైకి వచ్చింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం టీమ్‌ ఇండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj)ను ఓ వ్యక్తి నేరుగా సంప్రదించడం కలకలం రేపుతోంది. బెట్టింగ్‌ల వల్ల చాలా  డబ్బు నష్టపోయానని, జట్టులోని అంతర్గత విషయాలు చెబితే భారీ మొత్తంలో డబ్బులిస్తానంటూ సదరు వ్యక్తి సిరాజ్‌ వాట్సాప్‌కు మెసెజ్‌లు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఉద్యోగానికి భారత్‌లో అనువైన వర్క్‌ప్లేస్‌ ఇదే..

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ టాటా కన్సల్జెన్సీ సర్వీసెస్‌ (TCS) ఈ ఏడాది భారతదేశంలో అత్యుత్తమ వర్క్‌ ప్లేస్‌ (మెరుగైన పని వాతావరణం) సంస్థగా నిలిచింది. అమెజాన్‌, మోర్గాన్‌ స్టాన్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డిన్‌ (LinkedIn) నివేదించింది. భారతదేశంలో టాప్‌ 25 వర్క్‌ ప్లేస్‌ల జాబితాను ఈ మేరకు లింక్డిన్‌ షేర్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అలాగని నిరూపిస్తే.. నేను రాజీనామా చేస్తా: సీఎం మమత

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(AITC)కి జాతీయ హోదా అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు తాను ఫోన్‌ చేసినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. తమ పార్టీ జాతీయ హోదాను కోల్పోయినప్పటికీ పేరు మాత్రం ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌గానే ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పైరసీకి చెక్‌ పెట్టేలా కేంద్రం కీలక అడుగు.. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు కేబినెట్‌ ఓకే

సినిమా పైరసీని అరికట్టే దిశగా కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఇంటర్నెట్‌లో పైరేటెడ్‌ కంటెంట్‌ను అడ్డుకొనేందుకు కొత్తగా సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు 2023ను తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి కేంద్ర కేబినెట్‌ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వైట్‌హౌస్‌ ప్రాంగణంలోకి చిన్నారి.. ఆ తర్వాత ఏమైంది?

ప్రపంచంలోనే పటిష్ఠమైన భద్రత కలిగిన భవనం.. నిత్యం నిఘా నేత్రాల నీడ.. ఎటు చూసిన భద్రతా సిబ్బంది పహారా.. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ (White House) గురించే ఇదంతా. ఇందులోకి అనుమతిలేనిదే సామాన్యులకు ప్రవేశం ఉండదు. ఇంతటి భద్రత కలిగిన భవన సముదాయంలోకి అనుమతి లేకుండా ప్రవేశించడం మామూలు విషయం కాదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జనాభాలో భారత్ నంబర్‌ 1.. జీర్ణించుకోలేకపోతున్న చైనా!

ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా (Population) కలిగిన దేశంగా భారత్‌ (India) అవతరించింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో నంబర్‌.1గా ఉన్న చైనాను ఇండియా అధిగమించింది. 142.86 కోట్ల జనాభాతో ముందు వరుసలో నిలిచింది. అయితే, జనాభా విషయంలో తొలి స్థానం కోల్పోవడాన్ని డ్రాగన్‌ దేశం జీర్ణించుకోలేకపోతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారత్‌ జనాభా 142.86కోట్లు.. చైనాను అధిగమించి తొలిస్థానంలోకి..!

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస  బుధవారం విడుదల చేసింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్‌ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని