Siraj - BCCI: మ్యాచ్‌ ఫిక్సింగ్ కలకలం.. సమాచారం ఇమ్మంటూ సిరాజ్‌కు మెసేజ్‌లు!

భారత క్రికెట్‌లో మరోసారి మ్యాచ్‌ ఫిక్సింగ్ కలకలం రేగింది. మ్యాచ్‌ ఫిక్సింగ్ చేయాలని ఓ వ్యక్తి పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Siraj) ను సంప్రదించాడు. 

Updated : 19 Apr 2023 18:37 IST

దిల్లీ:  భారత క్రికెట్‌లో మరోసారి మ్యాచ్‌ ఫిక్సింగ్ కలకలం ఉదంతం తెరపైకి వచ్చింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం టీమ్‌ ఇండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj)ను ఓ వ్యక్తి నేరుగా సంప్రదించడం కలకలం రేపుతోంది. బెట్టింగ్‌ల వల్ల చాలా  డబ్బు నష్టపోయానని, జట్టులోని అంతర్గత విషయాలు చెబితే భారీ మొత్తంలో డబ్బులిస్తానంటూ సదరు వ్యక్తి సిరాజ్‌ వాట్సాప్‌కు మెసెజ్‌లు చేశాడు. దీంతో సిరాజ్‌ వెంటనే అప్రమత్తమై బీసీసీఐ (BCCI) అవినీతి నిరోధక విభాగానికి (ACU) ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించింది. అంతకంటే ముందే జనవరి, ఫిబ్రవరిలో శ్రీలంక, న్యూజిలాండ్‌ జట్లు భారత పర్యటనకు వచ్చి వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాయి. ఈ సిరీస్‌ల్లో భారత జట్టుకు సంబంధించిన అంతర్గత విషయాలను చెప్పాలని సదరు వ్యక్తి సిరాజ్‌కు మెసేజ్‌లు చేసినట్లు సమాచారం. 

‘‘సిరాజ్‌ను సంప్రదించిన వ్యక్తి బుకీ కాదు. అతను హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్‌. మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు వేయడం అతనికి అలవాటు. బెట్టింగ్‌లో చాలా డబ్బు కోల్పోయాడు. దీంతో జట్టు అంతర్గత విషయాలు చెప్పాలని సిరాజ్‌ను సంప్రదించాడు. ఈ విషయాన్ని సిరాజ్ వెంటనే మాకు తెలియజేశాడు.  సిరాజ్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయి’’ అని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని