Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 25 Jun 2023 21:15 IST

1. గురుపౌర్ణమికి అరుణాచలం వెళ్తారా? టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌

తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ(Arunachalam Giri Pradakshina) చేయాలనుకునే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ(TSRTC) గుడ్‌న్యూస్‌ చెప్పింది. గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరిప్రదక్షిణకు భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసింది. జూలై 3న అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని TSRTC నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కమల వికాసంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: జేపీ నడ్డా

మోదీ పాలనలో దేశం పురోగమిస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన భాజపా నవసంకల్ప సభలో నడ్డా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన వారికి నివాళులర్పించారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భాజపా సమావేశంలో తుపాకీ మోత..!

బిహార్‌లోని మాధేపుర జిల్లాలో నిర్వహించిన భాజపా సమావేశం రణరంగంగాన్ని తలపించింది. పార్టీలోని రెండు వర్గాల మధ్య వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఈ క్రమంలో ఇరు పక్షాల నేతలు, కార్యకర్తలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. అంతటితో ఆగకుండా.. పంకజ్‌ పటేల్‌ అనే కార్యకర్త తన వద్దనున్న లైసెన్స్ గన్‌తో పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు.. లైసెన్స్ ఇస్తే చాలని మస్క్.. వేలానికే అంబానీ మొగ్గు!

అమెరికా పర్యటనలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం వీలైనంత త్వరగా భారత్‌లో టెస్లా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని కంపెనీ సీఈవో ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన స్టార్‌లింక్‌ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. స్టార్‌లింక్‌తో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తేవచ్చని ఈ సందర్భంగా మస్క్ అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీన్‌ రిపీట్‌.. 62 ఏళ్ల తర్వాత రెండు మహానగరాలకు ఒకేసారి రుతుపవనాలు

దేశ రాజధాని దిల్లీ (Delhi), ఆర్థిక రాజధాని ముంబయి (Mumbai) నగరాలను వర్షాలు మంచెత్తుతున్నాయి. రుతుపవనాల కారణంగా ఈ రెండు మహానగరాల్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. దాదాపు 62 సంవత్సరాల తర్వాత ఈ రెండు మహానగరాలను ఒకేసారి రుతుపవనాలు పలకరించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎల్లలు దాటిన తండ్రీకూతురి అనుబంధం.. మనసులు కరిగిస్తున్న వీడియో

సాధారణంగా తండ్రికి కొడుకు కంటే కూతురిపైనే ఎక్కువ ప్రేమ ఉంటుందని చెబుతుంటారు. ఆమెకి ఏ చిన్న ఆపదొచ్చినా..తట్టుకోలేడు. అలాంటిది దేశం కాని దేశంలో ఓ అమ్మాయిని వదిలి రావాలంటే ఏ తండ్రికైనా కాస్త కష్టమే. ఏడాదిన్నరగా తన కూతుర్ని చూడకపోయేసరికి ఆ తండ్రి పరితపించిపోయాడు. కూతురికి సర్‌ప్రైజ్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక్కమాట కూడా చెప్పకుండా ఉన్నపళంగా భారత్‌ (India) నుంచి కెనడా (Canada) బయల్దేరి వెళ్లిపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రధాని మోదీకి ఈజిప్టు అత్యున్నత పురస్కారం

ఈజిప్టులో పర్యటిస్తున్న నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌’ (Order of the Nile) దక్కింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి దీనిని అందజేసి సత్కరించారు. 1915లో ప్రారంభించిన ఈ పురస్కారాన్ని.. దేశంతోపాటు మానవాళికి విశేష సేవలందించే వివిధ దేశాల అధినేతలు, రాజులు, ఉపాధ్యక్షులకు అందిస్తున్నారు. తాజాగా మోదీకి ఈ పురస్కారం వరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆలయంలో 10 కిలోల బంగారం మాయం.. రంగంలోకి అవినీతి నిరోధక శాఖ!

నేపాల్‌లోని ప్రముఖ పశుపతినాథ్‌ ఆలయంలో (Pashupati temple) బంగారం మాయం కావడం చర్చనీయాంశమైంది. సుమారు 100కిలోల బంగారు ఆభరణాలు ఉండాల్సి ఉండగా.. అందులో  దాదాపు 10కిలోల నగలు మాయమయ్యాయనే (Gold Missing) ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.. ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని సోదాలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మోదీని వరించిన అంతర్జాతీయ అవార్డులివే..!

ఈజిప్టులో పర్యటించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. ఆ దేశం అత్యున్నత పురస్కారమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌’ (Order of the Nile)ను ఇచ్చి సత్కరించింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి ఇప్పటివరకు 13 అవార్డులు వచ్చినట్లయ్యింది. వీటితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు/ఫౌండేషన్లు కూడా తమ అవార్డులతో సత్కరించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వాషింగ్టన్ మూమెంట్‌ అంటే ఇదే.. ఒకే ఫ్రేమ్‌లో నలుగురు ప్రముఖులు!

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ఎన్నో ఆసక్తికర విషయాలను, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden), ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ (Jill Biden) శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన స్టేట్‌ డిన్నర్‌కు పలువురు భారత పారిశ్రామివేత్తలు సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి  హాజరైన మహీంద్రా అక్కడి విశేషాలను కూడా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని